రాహుల్ గాంధీ అబద్దాలు చెప్తున్నారు:అమిత్ షా

0
65
Lucknow: BJP President Amit Shah addesses a press conference at party headquarters in Lucknow on Sunday. PTI Photo by Nand Kumar(PTI2_12_2017_000198B)

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అబద్దాలు చెప్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన నిరాధారంగా ఆరోపణలు చేస్తున్నారని అమిత్ షా విరుచుకుని పడ్డారు. దేశంలోని పారిశ్రామిక వేత్తల రుణాలను మాఫీ చేసినట్టుగా రాహుల్ గాంధీ అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ తాను చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని లేకుంటే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. రాహుల్ చేస్తున్న ప్రచారాలను నమ్మే స్థితిలో భారత దేశ ప్రజలు లేరని అమిత్ షా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అబద్దాలను చెప్పడం మానుకోవాలని అన్నారు. రైతులను ఆదుకోవడానికి వారిని అనేక ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. రైతులు ఎవరి హయాంలో సంతృప్తి కరంగా ఉన్నారనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై రాహుల్ గాంధీతో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని అమిత్ షా పేర్కొన్నారు. ఒకవేళ రైతులు తాలు చేస్తున్న పనుల విషయంలో సంతృప్తి కరంగా లేకపోతే క్షమాపణలు చెప్పాడానికి కూడా తాను సిద్ధమన్నారు.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here