వీడని పూరీ జగన్నాదుని ఆలయం మిస్టరీ | puri jagannath temple

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాదుని ఆలయం లోని భాండాగారాన్ని తెరవడానికి చేసిన ప్రయత్నాలు ఎందుకు విఫలం అయ్యాయి… స్వయంగా ఆ జగన్నాధుడే ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడా… ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి పూరీలోని కొన్ని వర్గాలు. పూరీలోని జగన్నాద్ధుని ఆలయంలో అంతులేని సంపదలు ఉన్నాయనేది భక్తుల విశ్వాసం .
కోర్టు ఆదేశాల మేరకు జగన్నదుని ఆలయం లోకి ప్రవేశించిన బృందం ప్రధాన భాండాగారంగా చెప్పుకునే మూడోగదిని తెరవకుండానే వెనుతిరిగింది. మూడోగది వరకు ఈ బృందం వెళ్లలేకపోయింది. బృందం ఎందుకు గదివరకు వెళ్లలేకపోయిందనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.
గతంలోనూ మూడోగదిని తెరవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గది దగ్గరకు వెళ్లిన తరువాత లోపలినుండి పెద్ద ఎత్తున పాము బుసలు వినిపించడంతో నాడు అక్కడిదాకా వెళ్లిన వారు వెన్కక్కి వచ్చేశారు. జగన్నాధుని అనంత సంపదను శేష నాగు కాపాడతారనేది భక్తుల విశ్వాసం. దీని వల్లే నాటి బృందం కూడా మూడో గదిలోపలికి వెళ్లే సాహసం చేయలేకపోయింది.
పూరీ జగన్నాదుని ఆలయం లోని ప్రధాన బాండాగారానికి 16మందితో కూడిన బృందం వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇందులో భారత పురావస్తు శాఖ అధికారులతో పాటుగా కోర్టు ప్రతినిధులు, ఆలయ అధికారులు ఉన్నారు. ఈ బృందం ఆలయంలోని ప్రధాన భాండాగారానికి చేరుకోలేదని తెలుస్తోంది. ప్రధాన భాండాగారాన్ని పరిశీలించేందుకు వెళ్లిన వారు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయకపోవడంతో అసలు మిస్టరీ ఏమిటనేది తెలియకుండా పోయింది.
భాండాగారానికి మరమత్తులు అవసరం అనే విషయాన్ని మాత్రమే చెప్పిన బృందం ఇతర విషయాలను ఏవీ వెళ్లడించలేదు. తమ రిపోర్టును కోర్టుకు సమర్పించనున్నట్టు ఈ ప్రతినిధి బృందం సభ్యలు చెప్తున్నారు.
అయితే ఆలయంలోకి వెళ్లిన బృందం ప్రధాన భాండాగారం లోపలికి వెళ్లలేదని వార్తలు బయటికి వచ్చాయి. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినపుడు వారికి అనుకోని ఆటంకాలు ఎదురయ్యాయనేది స్థానికుల కథనం. బృందంలోని కీలక సభ్యులు అఖస్మాత్తుగా తూలిపడిపోయి ఆయనకు గాయాలు కావడంతో బృందంలోని ఇతర సభ్యులు లోపలికి వెళ్లేందుకు భయపడినట్టు తెలుస్తోంది.
భారీ సర్పాలు ఉన్నాయని, లోపలికి వెళ్లినవారికి కీడు తప్పదని భారీగా ప్రచారం జరగడం కూడా వారు లోపలికి వెళ్లకుండా ఆగిపోవడానికి కారణంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా అసలు బంఢాగారానికి సంబంధించిన తాళం చెవులు మాయం అయ్యాయయనే ప్రచారం కూడా జరుగుతోంది. తాళాలు ప్రభుత్వ ట్రెజరీలో లేవని జిల్లా కలెక్టర్ ఇప్పటికే ప్రకటించారు. తమ వద్ద ఆలయానికి సంబంధించిన తాళాలు లేవని అవన్నీ దేవాలయానికి చెందిన అధికారుల ఆధీనంలో ఉన్నాయని చెప్తున్నారు. ఆలయ అధికారులు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు.
పూరీ జగన్నాదుని ఆలయం వ్యవహరం రాజకీయ రంగు పులుపుకుంది. అధికారు బీజేడీ పై భారతీయ జనతాపార్టీ విరుచుకని పడుతోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీ జగన్నాద్దుని ఆలయం గురించి ఒరిస్సా ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ద చూపడం లేదని బీజేపీ విమర్శిస్తోంది. అటు పూరీ శంకరాచార్య అనుమతి లేకుండా ఆలయంలోకి ప్రవేశించారు కాబట్టే ప్రతినిధి బృందానికి ఆటంకాలు ఎదురయ్యాయని గోవర్థన పీఠం ప్రతినిధులు అంటున్నారు.
మొత్తం మీద పూరీ జగన్నాద ఆలయం లోని సంపద బాంఢాగారం రహస్యం మాత్రం ఎవరికీ తెలియకుండా ఉండిపోయింది.
Puri Jagannath temple, Puri Jagannath temple treasury, Ratna Bhandar of Lord Jagannath temple, Orissa High Court , Lord Jagannath Temple, Jagamohan,
శబరిమల
Jagannath_Temple,_Puri
https://en.wikipedia.org/wiki/Jagannath
Sudarshana_Chakra
Gada
hanuman