విగ్రహాల ధ్వంసంపై ఆందోళన

0
85

విగ్రహాల కూల్చివేత అవాంఛనీయ పరిణామమని “ఫోరం ఫర్ మెడ్రనెస్ట్ ఇండియా” అబిప్రాయపడింది. ఇటీవల కాలంలో ఈ విపరీత పరిణామాలు ఎక్కువ కావడం పట్ల సంస్థ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. విగ్రహాల కూల్చివేత ఘటనకు నిరసనగా పీ అండ్ టీ కమ్యునిటీ హాల్ నుండి దిల్ షుఖ్ నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పి అండ్ టి కాలనీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. విగ్రహాల కూల్చివేత భారతీయ సంస్కృతికాదని ఇది విపరీత పరిణామాలకు దారితీస్తుందంటూ సభ్యులు నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ త్రిపురలో లెనిల్ విగ్రహాలు, బెంగాల్ లో శ్యాంప్రదాస్ ముఖర్జీ విగ్రహాలతో పాటుగా ఇటు తమిళనాడులో పెరియార్ విగ్రహాల ధ్వంసం చేయడం సరైంది కాదన్నారు. ఈ చర్యలకు ఎవరు పాల్పడినా దాన్ని ఖచ్చితంగా ఖండిచాల్సిందేనన్నారు.
ప్రగతీ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండి సత్యనారాయణ మాట్లాడుతూ దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతిలో భాగమని ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేసుకునే అవకాశం రాజ్యాంగం మనకు కల్పించిందన్నారు. పి అండ్ టి కాలనీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి మాట్లాడుతూ లెనిన్ లాంటి నేతలకు ప్రాంతీయ తత్వాలు ఆపాదించడం సరికాదన్నారు. లెనిన్ ను విదేశీయుడిగా పేర్కొనడం సరైంది కాదని ఆయన ప్రపంచనాయకుడన్నారు.
పి అండ్ టి కాలనీ సంక్షేమ సంఘం గౌరవ సలహాదారు బీ.ఎల్.ఎన్. కుమార్ మాట్లాడుతూ విధ్వంసకర రాజకీయాలు ఎవరూ చేసినా తప్పెనని ఇటువంటి ఘటనలను మొగ్గలోనే తుంచాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో భిన్నాబిప్రాయలు మామూలేనని అంటూ వారి ఆలోచనలతో విభేదాలు ఉన్నప్పటికీ లక్షలాది మంది అభిమానించే వారి విగ్రహాలను తొలలించడం లాంటిఘనలను ప్రతీ ఒక్కరూ ఖండిచాల్సిన అవసరం ఉందన్నారు.
రాజకీయ విభేదాల కారణంగా కొంత మంది మహనీయుల విగ్రహాలపై అక్కసు వెళ్లగక్కుతున్న తీరును తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకుడు సీహెచ్ ఓం ప్రకాశ్ తప్పుపట్టారు. ఇటువంటి పరిణామాలు సమాజంలో అలజడులకు కారణం అవుతాయని చెప్పారు. కొంత మంది తమ అక్కసును అంబేద్కర్, పెరియార్ లాంటి నేతల విగ్రహాలపై చూపడం ఎంతమాత్రం సరైంది కాదన్నారు. దేశంలోని మహా నేతలను గౌరవించుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలోని ప్రతీ పౌరుడిపై ఉందని “ఫోరం ఫర్ మెడ్రనెస్ట్ ఇండియా” కార్యదర్శి వై.వి.రవికుమార్ అన్నారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన భారతదేశ సమాజంలో ప్రతీ ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అధికారం ఉందని చెప్పారు. అభిప్రాయాలను విభేదించడం తప్పులేదని అయితే దేశం కోసం తమ జీవితాలనే త్యాగం చేసిన మహా పురుషుల విగ్రహాలను ధ్వంసం చేయడం ఎంతమాత్రం సరికాదన్నారు.
ప్రజాస్వామ్య దేశంలో భారతంలో విగ్రహాల ధ్వంసానికి చోటు లేదని సత్యనారాయణ ముదిరాజ్ పేర్కొనగా, ప్రతీ ఒక్కరూ సంయవనం పాటించాల్సిన అవసరం ఉందని ప్రేంకుమార్ జూలియస్ అన్నారు. భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీఓ నేత జి.రాజేశ్వర్ రావు, సంపత్ కుమార్ , బోని, సురేష్ దత్, నిరంజన్, అఖిలభారత మెడికల్ సంఘం అధ్యక్షుడు రాజ్ భట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here