పీఎస్‌ఎల్వీ సీ39 విఫలం

ఇస్రో ప్రయోగించిన పోలార్‌ ఉపగ్రహ వాహక నౌక-సీ39 (పీఎస్‌ఎల్వీ) ప్రయోగం విఫలం అయింది. తొలి మూడు దశలు విజయవంతం అయినప్పటికీ నాలుగో దశలో సమస్యలు తలెత్తాయి. ఈ దశలో రాకెట్ నుండి ఉప గ్రహం విడిపోలేదు. హీట్ షీల్డ్ నుండి రాకెట్ విడిపోకపోవడంతో ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టలేకపోయినట్టు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఉపగ్రహ ప్రయోగం విఫలం కావడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది. వరుస విజయాలతో దూసుకుని పోతున్న ఇస్రోకు ఇటీవల కాలంలో తగిలిన ఎదురుదెబ్బ ఇదే. ఒకే సారి 100 కు పైగా రాకెట్లను కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో ప్రయోగం ఈసారి మాత్రం అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. ప్రయోగం విఫలం కావడం తో నెల్లూరులోని శ్రీహరి కోట సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. మొదటి మూడు దశల్లో ఎటువంటి లోపాలు లేవని కేవలం నాలుగో దశలోనే ఇబ్బందులు వచ్చినట్టు ఇస్రో శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. లోపం ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని ఇటువంటి పొరపాట్లు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *