తెలంగాణలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటైన నిజాంసాగర్ తో పాటుగా శ్రీరాంసాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టులు నీటితో కళకళ లాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షల తో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 5వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 1055 కు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు. అటు నిజాంసాగర్ లోకి కూడా భారీగా వరద నీరు వస్తోంది. ఈ ప్రాజెక్టులోకి 2974 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. కళ్యాణి, సింగీతం ప్రాజెక్టులు కూడా నీటితో కళకళలాడుతున్నాయి. కళ్యాణీ ప్రాజెక్టులో 3 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. దీనితో మంజీరాలోకి వరద నీరు వచ్చి చేరింది. సింగీతం ప్రాజెక్టు లో కూడా 3 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడం పై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.