దేశం నుండి పోలియో భూతాన్ని తరిమేసేందుకు ఉద్దేశించిన పల్స్ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతోంది. దేశంలోని దాదాపు 17 కోట్ల మంది పిల్లలకు పోలియో చుక్కలను వేయాలాని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2018 సంవత్సరానికి గాని పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్రాపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఓ చిన్నారికి ఆయన చుక్కల మందు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోని 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ రెండు చుక్కల పోలియో మందును వేయడం ద్వారా పోలియో మహమ్మారి నుండి పిల్లలను రక్షించుకునే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మీపిల్లలకు లేదా మీకు తెలిసిన పిల్లలకు పోలియో చుక్కలు తప్పక వేయించండి.