విమానంలో పేలిన ఫోన్

ఆకాశంలో ఉన్న విమానంలో ఒక్కసారిగా సెల్ ఫోన్ పేలిపోవడం తీవ్ర కలకలాన్ని రేపింది. విమాన క్యాబిన్ లో మంటలు, పొగ తో ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీ నుండి ఇండోర్ కు వెళ్తున్న జెట్ ఎయిర్ వేస్ కు చెందిన విమానంలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ కి చెందిన అతుల్ ధాల్, ఆయన భార్య అర్పిత, కుమారుడితో కలిసి ఇండోర్ కు వెళ్తున్నారు. అర్పిత కు చెందిన ఫోన్ ను ఆమె తన హ్యాండ్ బ్యాగ్ లో ఉంచారు. అయితే ఆ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీనితో వెంటనే అప్రమత్తమత్తమైన విమాన సిబ్బంది హ్యాండ్ బ్యాగ్ ను విమానం వెనుక ప్రాంతానికి తీసుకుని పోయి మంటలను ఆర్పేశారు. అయితే పోలిపోయిన ఫోన్ ఏ కంపెనీకి చెందిందనే వివరాలను విమానయాన సంస్థ వెల్లడించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *