గుట్టుచప్పుడు కాకుండా పెట్రోలియం సంస్థల వాత

పెట్రోలు ధరల పెంపు లేదా తగ్గింపు వార్తలు కొద్దికాలం దాకా పతాక శీర్షికలకు ఎక్కేవి. పెట్రోలు ధరలు కొద్దిగా పెరిగానా విపక్షాలు ధర్నాలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తించేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. పెట్రోలు, డీజిల్ ధరలను ఏరోజుకారోజు నిర్ణయిస్తున్నారు. నొప్పి తెలియకుండా వినియోగ దారుడికి వాత పెడుతున్నారు. ఈ సంవత్సరం జులై 1వ తేదీనుండి ఇప్పటి వరకు పెట్రేల్ ధర దాదాపు ఆరు రూపాయల మేరకు పెరిగింది. ఈ పెంపు ఒక్కసారిగా లేకుండా దశల వారీగా ఉండడంతో వినియోగదారుడికి తెలియకుండానే వారి జేబులను ఖాళీ చేస్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలను ఏరోజుకారోజు నిర్ణయించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరవాత వినియోగదారుడికి భారీగానే వడ్డన పడింది. దాదాపు ఆరు రూపాయల మేరకు కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆయిల్ కంపెనీలు పెంచాయి.
ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్, భారత్ పెట్రోలియం సంస్థలు విడివిడిగా దేశంలో దాదాు 54 వేల పెట్రోలు బంకులను నిర్వహిస్తున్నాయి. దేశంలోని పెట్రోలియం అమ్మకాలను మొత్తం ఈ ముడు సంస్థలే నిర్వహిస్తున్నాయి. ప్రతీ రోజు ఉదయం 6.00 గంటలకు పెట్రోలియం ఉత్పత్తుల ధరలను నిర్ణయిస్తున్నారు. జులై 1వ తేదీ నుండి ఈ విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ మూడు సంస్థలు సంయుక్తంగా ధరలను నిర్ణయిస్తున్నాయి. పెట్రోల్ ధరలను గుట్టుచప్పుడు కాకుండా పెంచుతూ వినియోగ దారుల జేపులకు చిల్లులు పెడుతున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే పలు దఫాలుగా పెట్రోలు రేటు పెరిగింది. దాదాపు ఆరు రూపాయల దాకా అటు పెట్రోలు, ఇటు డీజిల్ ధరలను ఈ సంస్థలు పెంచుకుంటూ పోయాయి.
అంతర్జాతీయ చమురు మార్కెట్ లో ధరలు తక్కవుగా ఉన్న సమయంలోనే మన దేశ పెట్రోలియం సంస్థలు ఇంత భారీ మొత్తంలో ధరలను పెంచితే ఇక అంతర్జాతీయ చమురు మార్కెట్ లో ధరలు పెరిగితే పరిస్థితి ఎట్లా ఉంటుందోనని సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *