పెట్రోలు ధర పైసా తగ్గింది… పండగ చేస్కోండి…

పెట్రోలు ధర లను పెంచుకుంటూ పోతూ సామాన్యుడి నెత్తిన మొడుతున్న పెట్రోలు కంపెనీలు 16 రోజుల తరువాత ధరలను తగ్గించాయి. ఈ వార్తను చదవి సంబరపడిపోకండి ఇంతకు ఎంత ధర తగ్గించారో తెలుసుకుంటే మీ దిమ్మతిరిగి బైండ్ బ్లాంక్ కావడం ఖాయం. ఇంతకీ పెద్ద మనసు చేసుకుని పెట్రోలు కంపెనీలు తగ్గించిన ధర ఎంతో తెలుసా అక్షరాలా పైసా… నిజమే నీరు చదివింది వాస్తవమే… పెట్రోలియం కంపెనీలు ఒక్క పైసా పెట్రోలు ధర ను తగ్గించాయి. పెట్రోలు ధర 60 పైసలు డీజిల్ ధర 52 పైసలు తగ్గినట్టుగా ఉదయం వార్తలు వచ్చినప్పటికీ ఆ తరువాత పెట్రోలు కంపెనీలు సరించిన రేట్లను ప్రకటించాయి. తమ వెబ్ సైట్ లో మార్పులు చేశాయి. దీని ప్రకారం వారు తగ్గించింది కేవలం ఒక్కసైసా మాత్రమే…
అంతర్జాతీయ విపణిలో భారీగా పెరిగిపోయిన ముడిచమురు ధరకు అణుగుణంగా పెట్రోల్ ధరలను పెంచుకుంటూ పోయిన కంపెనీలు 16 రోజుల పాటు ఏకధాటిగా ధరలను సంరించుకుంటూ పోయాయి. దాని తరువాత ధరలను తగ్గించినట్టు వార్తలు వచ్చినప్పటికీ వాస్తవానికి వాళ్లు తగ్గించిన ధర కేవలం ఒక్క పైసా మాత్రమే. వినియోగదారుడి పై పెట్రోలు బాంబులు వేసి మంటపెట్టిన కంపెనీలు ఒక్క పైసా ధరను తగ్గించడంపై వినియోగదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క పైగా ధరను తగ్గించడం దేనికని దిని వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.
కర్ణాటక ఎన్నికల సమయంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచిన సర్కారు ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలను పెంచడం మొదలు పెట్టింది. పెట్రోలు ధరలను పెంచుకుంటూ పోతూ ఏకధాటిగా ప్రజల నెత్తిన మొడుతున్న పెట్రోలియం సంస్థలు వినియోగదారుడిపై ఎటువంటి కనికరం చూపించకుండా ధరలను ఆకాశమే హద్దుగా పెంచుకుంటూ పోతున్నాయి. ఇదే క్రమంలో పెట్రోలు ధరలు పెరిగితే లీటరు పెట్రోలు రు.100 కావడం ఖాయమనే వార్తలు వచ్చాయి.
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల పెరుగుదలతో పాటుగా ఇటు కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు వివిధ రకాల ట్యాక్సులతో పెట్రోల్ ధర తడిసిమేపెడవుతోంది. డీజిల్ ధరలు అమాతం పెరిగిపోవడంతో ఆ ప్రభావం ఇతర వస్తువులపై కూడా భారీగా పడుతోంది. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.
దేశరాజధాని న్యూఢిల్లీలో ఈరోజు పెట్రోల్‌ ధర లీటరుకు ఒక్క పైసా తగ్గి రూ.78.42గా ఉంది. డీజిల్‌ ధర కూడా ఒక్క పైసా తగ్గి రూ.69.30గా ఉంది. మే 14వ తేదీ నుంచి వరుసగా 16 రోజులుగా పెట్రోల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మొత్తంగా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.3.8 పైసలు పెరగగా, లీటరు డీజిల్‌ ధర రూ.3.38 పైసలు పెరిగింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రాష్ట్రానికీ రాష్ట్రానికీ మారుతుంటాయి.
petrol, diesel price, Indian Oil Corporation (IOCL), Petrol and diesel prices, Delhi, first time in 16 days that prices have been cut since May 14, Petrol and diesel prices in India, aSingapore gasoline prices GL95-SIN and Arab Gulf diesel prices.

గుడ్డిగా నమ్మి… నగ్న చిత్రాలు తీయించుకుని…


సమ్మెకు దిగిన బ్యాంకు ఉద్యోగులు
https://en.wikipedia.org/wiki/Ministry_of_Petroleum_and_Natural_Gas