ప్రముఖ సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రయ్యారు. పవన్ కళ్యాణ్ భార్య ఆనా లెజ్నెవా హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చారు. పవన్ కళ్యాణ్ కు ఇప్పటివరుక ముగ్గురు పిల్లలు ఉండగా ఇది నాలుగవ సంతానం. తన కుమారుడిని ఎత్తుకుని మురిసిపోతున్న పవన్ కళ్యాణ్ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ -లెజ్నెవా దంపతులకు పొలీనా అనే పాప ఉంది. పవన్ కళ్యాణ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రేణూ దేశాయ్ ను పెళ్లి చేసుకున్నారు. దేణుకు ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చి పవన్ రష్యన్ జాతీయురాలిని మూడవ వివాహం చేసుకున్నారు. పవన్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.