నా వెనుక ఉంది ప్రజలే: పవన్ కళ్యాణ్|Pawan Kalyan targets TDP

0
109

ఎవరో తనను వెనకఉండి నడిపిస్తున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిప్పికొట్టారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన తన వెనుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్ప ఎవరూ లేరని అన్నారు. ఎవురో చెప్పినవి విని నడుచుకునే వ్యక్తిని కాదన్నారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని, ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని అన్నారు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవంలేదన్నారు.
తెలుగుదేశం పార్టీ పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని మరోసారి పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు స్వప్రయోజనాలకోసం కోసం తప్ప ఏపీ ప్రజల కోసం ఏమీ చేయడంలేదని విమర్శించారు. తెలుగు ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే 2014 ఎన్నికల్లో తాను బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి మద్దతుగగా నిల్చానని అన్నారు. నాలుగు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయకున్నా నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు లేనిపోని హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలోని సమస్యలపై తనకు స్పష్టమైన విధానం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా పట్టించుకునే స్థితిలో టీడీపీ సర్కారు లేదన్నారు. ఏపీలో పెరుగుతున్న అవినీతిపై ఇటవీల తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
pawan kalyan, janasena,janasena party, national media, pavan kalyan, pavan, kalyan, chandrababu naidu, nara chandra babu naiidu, nara lokesh, telugudesam, telugudesam party, tdp, bjp.Pawan Kalyan targets TDP.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here