టీడీపీపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్

జన సేన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
– నేను ముఖ్యమంత్రి కొడుకును కాదు అల్లుడిని కాదు. ఒక సాధారణమైన కానిస్టేబుల్ కొడుకుని. నేను పుట్టింది బాపట్లలో.
– భారత్ మాతాకీ జై అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
– ఈ సందర్భంగా అరుణ్జైట్లీని ఉద్దేశించి తెలుగులో మాట్లాడితే అర్థం కాదని అందుకే ఇంగ్లీషులో మాట్లాడాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ ఇంగ్లీషులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
– పది నిమిషాల అనంతరం మరల తెలుగులో తన ఉపన్యాసాన్ని కొనసాగించారు
– తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పవన్ పిలుపునిచ్చారు
– గత నాలుగేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై గళం విప్పారు
– కొందరు భయపడతారు అలాంటి భయం నాకు అలాంటిదేమీ లేదని అన్నారు
– దోపిడి చేసే వారికి పిరికితనం ఉంటుంది గానీ జనసేనకు పిరికితనం అనేది ఉండదని పవన్ అన్నారు.
– ప్రజలకు అండగా ఉండడమే నా ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.
– భావితరాల కోసం ఏమి విడిచిపెట్టమని ఆయన ప్రశ్నించారు
– సమకాలీన రాజకీయ వ్యవస్థలు ప్రజలను వంచించి పాలన చేస్తున్నాయని విమర్శించారు.
– లోకేశ్ అవినీతి చంద్రబాబుకు తెల్సా; అంటూ.. సెటైర్లు వేసిన పవన్. ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందంటూ.. పవన్ వ్యాఖ్యలు.
– 2019 నాటికి పవన్ సపోర్ట్ ఉంటుందో లేదో అని అవినీతికి పాల్పడతారా అని ప్రశ్నించిన పవన్.
– రాజధాని ముసుగులో ప్రక)తి నాశనం చేయకూడదంటూ పిలుపు.
– ఆక్వా పార్క్ ఘటనలో అరెస్ట్ అయిన వారిని సభపైకి పిలిచి సంఘీభావం పలికిన పవన్.
– మహిళా ఎమ్మార్వో దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేనిపై ఫైర్ అయిన పవన్. ఎమ్మెల్యేకు శిక్షే లేదా?ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు దాడా?
– మహిళా అధికారిపై దాడి చేస్తే సర్ధుకుపోవటమా? సింగపూర్ తరహా రాజధాని చేస్తాం అన్నారు. సింగపూర్ తరహా పాలన కావాలి ముఖ్యమంత్రి గారూ..
– సింగపూర్ ప్రధాని లీ హయాంలో దారుణమైన శిక్షలు వేసేవారు. లాఠీలతో కొట్టాలి. సరే.. ప్రజాస్వామ్యం ఒప్పుకోదు అంటే.. ఎలాంటి సంకేతాలు పంపుతున్నారు. సింగపూర్ తరహా రాజధాని చేస్తా అంటున్న ముఖ్యమంత్రి.. అలాంటప్పుడు సింగపూర్ తరహా పాలన కావాలి కదా.. సింగపూర్ జాతిపిత లీ వాన్ యూ లాంటి వ్యక్తి పాలన అందించాలి అన్నారు. లంచం తీసుకున్న స్నేహితుడిని జైల్లో పెట్టిన వ్యక్తిత్వం లీ వాన్‌ది అన్నారు. ఆయన్ను ఆదర్శంగా చెప్పే చంద్రబాబు ఏం చేస్తున్నారన్నారు. వనజాక్షిపై జరిగిన దాడి లాంటిదే సింగపూర్‌లో జరిగి ఉంటే.. తోలు ఊడిపోయేటట్టు కొట్టేవారని చెప్పారు
శాంతిభద్రతలు ఎక్కడున్నాయ్?
-తమ పొలిటికల్‌ బాస్‌ ఒత్తిడి వల్ల అవినీతి చేయాల్సివస్తోందని, అధికార పార్టీ నేతలు తన దగ్గర గోడు వెళ్లబోసుకుంటున్నారని జనసేన అధినేత పవన్‌ వెల్లడించారు.
ఏపీలో సరికొత్త రాజకీయశకం మొదలైందని, ఈ రోజు నుంచి టీడీపీ వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు.
*మీరు చేసిన తప్పులను ప్రజలకు వివరిస్తామని, ఇసుక మాఫియాకు అండగా ఉన్న నేతలను నిలదీస్తామన్నారు.
– 6 ఏళ్లలో 70 కోట్లు సంపాదించాను. 25 కోట్లు ట్యాక్స్ కట్టాను. పారిశ్రామకవేత్తలు అంటే నాకు గౌరవం. పెట్టుబడి పెడితే.. అంతకు అంత ఆదాయం వస్తుంది.
– ఇసుక ఎవరిది.. భూమాతది. అలాంటి భూమాతను అడ్డగోలుగా లాగేస్తున్నారు. భూమిలోకి అడ్డంగా లాక్కొని వెళ్లిపోతుంది. నమ్మకాన్ని వంచించారు.
– ఎర్రచందనం అమ్మితే ఎన్నికోట్లు వచ్చాయని, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధే… అభివృద్ధి అని వ్యాఖ్యానించారు.
ఏపీ సహా కొన్ని రాష్ట్రాలు పర్యావరణ చట్టాన్ని పట్టించుకోవడం లేదని పవన్ విమర్శలు చేశారు.
– ఉద్దానం కోసం హార్వర్డ్ నుంచి ఫ్రొఫెసర్లు తెస్తే.. ఏం చేశారు. కొంతే. అధికారం కొందరికేనా; కొన్ని కులాల గుప్పిట్లోనేనా? కుదరదు. అన్నికులాలకు న్యాయమైన అధికారం వచ్చి తీరాలి. వచ్చే రాజకీయ ప్రయాణం జరిగి తీరుతుంది. కొద్ది మంది ఆధిపత్యంలో ఉంటే చాలా దారుణలు జరుగుతాయి.
– రాయలసీమ, ఉత్తరాంధ్ర వెళ్తే బోలెడన్న వనరులు ఉన్నాయి. ప్రజలేమో వలసలు వెళ్తే.. రాజకీయ నాయకులు ఎందుకు వలస వెళ్లరు? బొత్స సత్యనారాయణ ఎందుకు వలస వెళ్లరు. ఆర్థిక వనరులు ఎందుకు కంట్రోల్ చేయరు. రాయలసీమ కూడా అంతే.
– ఎంత మంది ముఖ్యమంత్రులు వచ్చారు రాయలసీమ నుంచి. స్వయాన చంద్రబాబు రాయలసీమ వ్యక్తే. ఎంతమంది ఆడపడుచుల కన్నీళ్లు ఉన్నాయి. ఒక్కొక్కరి కథ వింటుంటే గుండె తరుక్కుపోతుంది.
– రైతులు ఆరుగాలం రోడ్డుమీద పడేస్తుంటే.. గుండెతరుక్కుపోతుంది. గిట్టుబాటు ధర ఇవ్వరు. మొత్తం దళారీకే పోతోంది.
– టీడీపీ చేసే తప్పులకు ప్రజలు ఎందుకు శిక్షింపబడాలి.
– 29 సార్లు ఢిల్లీ వెళ్తే ప్రధాని మంత్రి పట్టించుకోవటం లేదంటే ఎలా? మన బంగారం మంచిదై ఉండాలి కదా.
– ప్రత్యేక హోదాపై మీరు మాట్లాడితే ఆరు అబద్ధాలుగా వినిపిస్తోంది.
– 2019లో మీకు ఎలా ఓటేస్తారనుకుంటున్నారు. ఏ కాలంలో టీడీపీ నేతలు ఉన్నారు. ప్రజలు బుద్ధి ఉండదు. శుంఠలు అనుకుంటున్నారు.
– ఓటుకు నోట్ల వ్యవహారంలో నేను కొత్తగా వచ్చిన రాష్ట్రం అని తగ్గి మాట్లాడాను.
– డీ మానిటైజేషన్ వ్యవహారంలో టీటీడీ మెంబర్ శేఖర్ రెడ్డి వ్యవహారం ప్రస్తావించిన పవన్. అందులో లోకేశ్ హస్తం ఉందని పరోక్షంగా ప్రస్తావించిన పవన్. అందువల్లే.. బాబు కేంద్రానికి సాగిలపడ్డారన్న పవన్.
– గాలి జనార్థన్ రెడ్డి వ్యవహారం తప్పు అయితే.. మీరు ఇసుక, ఎర్ర చందనంలో చేస్తున్నవి తప్పు కాదా?
– అటు నెల్లూరులో ఇటు ప.గో. జిల్లాలో దీవుల్ని పెకలించి చెన్నైకి అమ్మేస్తున్నారు.
– యాక్సిడెంట్ అయితే ఆ మనిషిని దోచుకుంటారా? విభజన తర్వాత ఏపీని ఎలా చూసుకోవాలి. కన్న తల్లిని దోస్తారా? తెలుగు తల్లికి ద్రోహం చేస్తారా?
– 2014లో వైయస్ఆర్ సీపీ వస్తే కబ్జాలు, దోపిడీలు చేస్తారని చెప్పారు. విశాఖలో టీడీపీ నేతలు అరాచకాలు పెరిగిపోయాయి. దళిత మహిళ భూములు దోచుకున్నారు. ఒకటా, రెండా పుంఖానుపుంఖానులుగా పాపాలు వస్తున్నాయి. టీడీపీపై పోరాటం చేస్తాం. పోరాడితే పోయేది ఏముంది బానిస సంకెళ్లు తప్ప అన్న పవన్.
– అవినీతి ఏ స్థాయికి వెళ్లిపోయిందంటే.. విజయవాడ కనకదుర్గా దేవి వద్ద పార్కింగ్ లో 25% ఎమ్మెల్యేకి వెళ్లాలంట. చాలా చాలా దురద)ష్టకరమైన పరిస్థితి. అవినీతిలో కనకదుర్గమ్మ భక్తులను కూడా దోచేస్తున్నారు.
– ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. ఎస్సీ యువత పది మంది ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్లాలి. జంగందేవర నుంచి వెనుకబడిన కులాల వరకు అండగా నిలబడే విధంగా వ్యవహరిస్తాం. ఉండటానికి గూడు, దాచుకోవటానికి ఓ విధానం తెస్తాం.
– అనంతపురంలో అక్కచెల్లెల్లు అడిగారు.. అగ్రకులాల్లో వెనుకబడిన పేదలకు ఏం చేస్తారు అడిగితే..మీరు చదువుకోవటానికి, ఎదగటానికి అన్ని విధాలా అండగా ఉంటాం.
– ఆగస్టు 14న జనసేన మేనిఫెస్టో విడుదల చేస్తాం. దానిబట్టే మీకు అర్థమౌతుంది.
– మత్స్యకారుల విషయంలో మద్దతు అడిగితే.. ఎస్టీ యువతను నాపై ఉసిగొల్పారు. మేనిఫెస్టోలో పెట్టింది ఎవరు? సాధించలేం అని తెల్సి కూడా.. (చంద్రబాబు) దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నవారు రాళ్లు రువ్వుకొని కొట్టుకునే పరిస్థితి తెచ్చారు.
– కాపుల రిజర్వేషన్ గురించి మట్లాడారు. కాపుల రిజర్వేషన్లు సాధ్యమా? కాదా; ప్రజల్ని మభ్యపెట్టి.. రిజర్వేషన్లు ఇస్తామన్నారు.
– ప్రెసిడెంట్ ఆఫీస్ లో కోల్డ్ స్టోరేజీలో పడేశారు. ఇక బయటకు రావు. కాపులు, బీసీలు, మత్య్సకారులు, ఎస్సీలకు గొడవపెట్టారు.
– సాధ్యం కాదని తెల్సి కూడా.. సమాజంలో విచ్చిన్నం చేయబోయారు.
– కోట్లు ఖర్చు పెట్టి. .హైద్రాబాద్ లో ఫైవ్ స్టార్ లో ఉండగలరు. మీరు చేసిన పనుల వల్ల సంఘంలో గొడవలు వస్తున్నాయి.
– ఏపీ పునర్ నిర్మాణం ఇలా కాదు.. సింగపూర్ లా ఎత్తైన భవనాలు కాదు.. కావాల్సింది.
– జనసేన ఏ ఒక్కకులాన్ని మభ్యపెట్టదు. ప్రతి ఒక్కరికీ ఆర్థిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పిస్తే చాలు. మిగతావి రాజ్యాంగం ప్రకారం జరగాలి.
– అంబేద్కర్ చెప్పినట్లు కులాల నిర్మాణం చేయగలమో లేదో కానీ..జనసేన కులాల మధ్య చిచ్చుపెట్టదు.
– దామోదర్ సంజీవయ్య ఆలోచన చేస్తాం. రాజీవ్, ఇందిరాగాంధీ పేర్లేనే.. డొక్కా సీతమ్మ పేర్లు సంక్షేమ పథకాలకు ఎందుకు పెట్టరు.
– ఆంధ్రులు-కళింగ వర్గానికి సర్దార్ గౌతులచ్చన్న పేర్లు ఎందుకు పెట్టరు.మిగతా వారు నాయకులు కారా? వారిని స్మరించుకోవటం వల్ల మంచి జరుగుతుంది. బైబుల్ సూక్తి చెప్పిన పవన్.
– ప్రజలు ఓటు బ్యాంకు కాదు.. నా కుటుంబం. నిండు జీవం ఉన్న మనుషులు. బంగారంలా… ఓ ప్రేమగా చూసుకోవాలి.
– ముస్లిం మతస్తులకు సంబంధించి.. నా కూతురు, నా పిల్లలు ఇద్దరూ క్రిస్టియన్, హిందూ మతం.
– చిన్నప్పుడు రైతును అయ్యేవాడిని ఏమో. భగవంతుడు ఇన్నికోట్ల ప్రజల ప్రేమాభిమానాలు ఇచ్చారు. దీనికి ఏదో ఉద్దేశం ఉండాలి. అందుకే సుఖం లేదు.
– విదేశాల్లో ఉన్నా, ఖరీదైన హాటల్ లో ఉన్నా తప్పు చేసినవాడిలా ఉండేది. వీటన్నిటి నుంచి తప్పించుకోలేను.
– ఎక్కడ ఉన్నా పవన్ గుండె మీకోసం కొట్టుకుంటుంది. మీకు నాకు మధ్య దూరం పిలుపే..
– ముస్లిం యువతకు నేను విజయవాడ, అమరావతిలో ఉంటా. మంగళగిరిలో ఉంటా. జనసేన ఆఫీసుకు వస్తా. ప్రతి ఒక్కటీ తెల్సుకుంటా.
– ముస్లిం యువతకు కూడా మీ సమస్యలు నాకు చెప్పండి. నేను మిమ్మల్ని మోసం చేయను.
– బీజేపీతో వెళ్లినప్పుడు ముస్లింలు దూరం అవుతారని చెప్పారు. నేను హిందూ సంస్థ అని వెళ్లలేదు. రైట్ అనుకున్నా చేశా. ఒక మతానికి ఎక్కువ తక్కువ అనేది ఉండదు.
– వైయస్ఆర్ సీపీ నాయకులు అంటున్నారు. బాబు డైరెక్షన్ లో చేస్తున్నానా? మీకు అనిపిస్తోందా? ఒక్కసారి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి.
మీరు మోడీ గారికి దర్శకత్వం వహిస్తున్నారా అంటే ఎలా ఉంటుంది. సత్యఆవిష్కరణ మొత్తం ఉండాలి. పవన్ చేయగలిగేవి.. చేయలేనివి కొన్ని ఉంటాయి. నేను తప్పు చేస్తే.. మీరు విధించే చట్టం విధించే శిక్ష కంటే నేను బలంగా శిక్షించుకుంటా.
– శ్రీ వైయస్ జగన్ గారిని అవిశ్వాస తీర్మానం పెట్టమంటే ప్రభుత్వం పడిపోతుంది కాదు. కానీ మీరు 23న పెడతామన్నారు. అరగంటలో దేశ బడ్జెట్ తోసేశారు. ముఖ్యమంత్రికి అపాయిట్ మెంట్ ఇవ్వలేదు. విజయసాయిరెడ్డికి అపాయిట్ మెంట్ ఎలా ఇచ్చారు.
– మీకు ఓట్లేస్తే ప్రజలు దూరమవుతారని ఆలోచిస్తున్నారా? ఓటు బ్యాంక్ పాలిటిక్స్ నాకు విసుగు. అసహ్యం.
– ఎవరు ఎలా మాట్లాడుతున్నారో ప్రజలు గమనించండి. ప్రజల్ని మభ్యపెట్టేవారు ఎవరైనా.. దాని పర్యవసానం మీరే వహించాలి.
– నియోజకవర్గానికి రూ.25 కోట్లు అంటే ఎక్కడ నుంచి వస్తున్నాయ్. మనందరి సమిష్టి సొమ్మును రకరకాల నిధుల రూపంలో తీసుకువచ్చి.. మళ్లీ ఓట్ల రూపంలో రూ.2,500 కొంటున్నారు.
– 2019 నాటికి జనసేన దగ్గర డబ్బులు ఉంటాయి. రూ.2,500 కాదు.. 5వేలు వారి దగ్గర తీసేసుకోండి.
– మీరు డబ్బులు తీసుకోండి. దేవుడి పటం చూపించినా మీరు ఓటేయండి.పూజారులు, మత ప్రచారకుల్ని దింపుతారు. డబ్బులు ఇస్తే తీసుకోండి. ఫట్ మని జేబులో పెట్టుకోండి. ఓటు మాత్రం జనసేనకే వేయండి.
– ప.గో.జిల్లాకు సంబంధించి.. ఆక్వా విదేశీ మారకద్రవ్యం వస్తుంది. పెద్ద రైతులు బావున్నా.. చిన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికోసం పాలసీ.
– తూ.గో. జిల్లాకు సంబంధించి.. కాకినాడలో పెట్రో ఫ్యాక్టరీ రావాలనుకున్నాం. రాలేదు. అక్కడున్న యువతకు సరైన ఉపాధి అవకాశాలు ఉండేలా చూడాలి. కేంద్రం ఇవ్వకపోతే.. మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించుకునే సత్తా లేదా?
– విశాఖలో రైల్వే జోన్ రావాలి. దానికోసం పోరాడదాం.
– 9394022333కి మిస్డ్ కాల్ ఇచ్చి జనసేన సభ్యత్వం తీసుకోవచ్చు.
-25 సంవత్సరాలు ప్రజా సేవకు అంకితం అవుతానని చెప్పా. తెలంగాణ నుంచి జనసేన కార్యకర్తలు వచ్చారు. అక్కడ ప్రజలకు న్యాయం చేయటానికి సరికొత్త వేడి రక్తం ఉన్న తెలంగాణ యువత కావాలి. ఏపీలో కొత్త యువనాయకత్వం కావాలి.
– ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటా. ఏపీ ఆత్మగౌరవం ఏంటో దేశానికి తెలియాలి. పొట్టి శ్రీరాముల స్ఫూర్తి ఇంకా మర్చిపోలేదు.
– రోడ్ల మీద పోరాటాలు చేస్తాం. ప్రత్యేక కేటగిరీకి సంబంధించి చేతులు దులుపుకు వెళ్తే చూస్తూ ఉండేవాళ్లం కాదు. ఆమరణ నిరాహార దీక్షకి ఈ రోజు నుంచి ఎప్పటికైనా సిద్ధంగా ఉన్నా. కేంద్రం ఏదో ఒకటి సమాధానం చెప్పితీరాలి. మేం అనుకున్నాం ఇవ్వం అంటే కుదరదు. కేంద్రం, రాష్ట్రం, ప్రతిపక్షానికి తెలియజేస్తున్నా. ఏదో డ్రామాలు చేసి చేతులు దులిపేసుకున్నానంటే.. చెవిలో పూలు పెట్టుకొని కూర్చోలేదు.
– ఒక్క ప్రత్యేక హోదా సమస్య కాదు. రేపొద్దని ఏదో చట్టానికి వర్తిస్తుంది. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనిమీద సమాధానం ఇవ్వాలి. కచ్చితంగా దీనిమీద చాలా బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. అందువల్ల దీన్ని చాలా గుండె లోతుల్లోకి ఈ పోరాటాన్ని తీసుకుంటున్నా. రాష్ట్రప్రభుత్వానికి, ప్రతిపక్షానికి దీనిమీద మున్ముందు ప్రజా ఉద్యమాలు చూస్తారు. అలాగే, ఆమరణ నిరాహార దీక్ష తర్వాత ఏం జరుగుతాయో నా చేతుల్లో ఉండవ్..
pawan kalyan, pawan,kalyan, janasena,janasena party, pawan kalyan party, telugudesam, teludesam party, chandrababau naiidu.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *