వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అంటే తనకు వ్యక్తిగతంగా ఎటువంటి వ్యతిరేకతా లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జిల్లాల పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ విశఖపట్నంలో జనసేన సమన్వయకత్రల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ను తాను వ్యక్తిగతంగా ధ్వేషించడం లేదన్నారు. అయితే తన తండ్రి సీఎం గా ఉన్నాడు కాబట్టి తనకు కూడా సీఎం పదవి కావాలనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి పదవి వారసత్వంగా వచ్చేది కాదన్నారు. రాజకీయాల ద్వారా కొంత మంది వేల కోట్ల రూపాయలను కూడబెట్టుకున్నారని దీన్ని తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. గత ఎన్నికల్లో అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసినట్టు జగన్ పేర్కొన్నారు.
తనకు ప్రజలే బంధువులని వారికోసమే తాను పనిచేస్తున్నానని అన్నారు. చంద్రబాబు, మోడి తనకు బంధువులు కాదని చెప్పారు. ప్రజలకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే వారికి మద్దతు పలికినట్టు పవన్ చెప్పారు. చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేసే రకమని చాలా మంది తనతో చెప్పారని అయితే అట్లాంటి విషయాలు తనకు తెలియదా అని పవన్ ప్రశ్నించారు. రాజకీయాలు బాగుంటే వాటిల్లోకి తాను వచ్చేవాడిని కాదన్నారు. సినిమా తనకు అన్నంపెట్టిందని అందుకే సినిమా రంగంపై తనకు అంతులేని గౌరవం ఉందన్నారు. సినిమాల వచ్చ వ్యవస్థలో మార్పులు వస్తాయని అనుకోవద్దన్నారు. సినిమాల వల్ల ఎటువంటి మార్పులు రావని మార్పు కేవలం సమాజ సేవ ద్వారానే వస్తుందన్నారు.