పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇక బర్త్ సర్టిఫికెట్ లేదని బాధపడాల్సిన అవసరం లేదు. బర్త్ సర్టిపికేట్ బదులు ఆధార్ కార్డులోని జన్మదిన తేదీని నమోదు చేస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు బర్త్ సర్టిఫికెట్ లేనివారు పదవతరగతి సర్టిఫికెట్ లేదా అఫడవిట్ దాఖలు చేయాల్సి వచ్చేది. ఆధార్ కార్డులో నమోదయిన వివరాలనే పాస్ పోర్టులో నమోదు చేస్తారు. ఈ వెసులుబాటు కారణంగా పాస్ పోర్టు దరఖాస్తు దారులకు పెద్ద ఊరట లభించినట్టయింది.