దహన సంస్కారలకు నోచుకోని అభ్యాగ్యులు-చేయుతనిచ్చిన పప్పిసార్ ఫౌండేషన్

ఎల్బీనగర్ లోని ట్రినిటీ అనాధ వృద్ధాశ్రమంలో ఉన్న వారి పరిస్థితి దయనీయంగా తయారయింది. జీవిత చరమాంకలంలో నా అన్న వాళ్లు లేని ఎందరో అభాగ్యులు ఈ ఆశ్రమంలో ఉన్నారు. అటువంటి సమయంలో ఆశ్రమ నిర్వాహకురాలి భర్త అనారోగ్యంతో ఐసీయులో ఉండడం వారికి మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. వృద్ధాశ్రమంలోని ఒకరు అనారోగ్యంతో చనిపోవడంతో అక్కడున్న వారు ఏమీచేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోయారు. కనీసం తినడానికి తిండిలేక ఆశ్రమంలో ఉంటూ కాలం వెళ్లదీస్తున్న వారు చనిపోయిన సహచరులకు అంత్యక్రియలు చేయలేని పరిస్థితి…
మనసున్న ఒకరిద్దరు వారి అంత్యక్రియల ఏర్పాట్లకు గాను అనాధ శవాల దహనక్రియలకోసం ఏర్పడిన పప్పిసార్ పౌండేషన్ ను సంప్రదించడంతో వారు ముందుకు వచ్చి అంత్యక్రియలకు సహాయం చేశారు. ఆశ్రమంలో ఏంతో మంది పేదలైన వృద్దుల పరిస్థితి నేడోరేపో అన్న విధంగా తయారయిందని అశ్రమాన్ని పరిశీలించిన రత్న చెప్తున్నాడు. ఎల్బీనగర్ లోని శ్రీకాంత చారి విగ్రహం వెనక సందులో ట్రినిటీ అనాధ ఆశ్రమం ఉందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *