తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు..?

తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలు కానుంది. పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో 12,751 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో కొన్ని కొత్తగా ఏర్పాటయినవి. వీటన్నింటికీ ముడు దఫాలుగా పోలింగ్ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కు కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహణ ఇతరత్రా అంశాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జూన్ 6న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 23 కల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో రాజకీయపార్టీలు నేరుగా పోటీచేసే అవకాశం లేనప్పటికీ పార్టీల మద్దతుతోనే ఎన్నికల ప్రక్రియ మొత్తం సాగుతోంది. చట్టం ప్రకారం ఈ ఎన్నికల్లో 50 శాతం సీట్లను మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రక్తసిక్తం


ఆందోళనకు దిగిన హోంగార్డులు-రోడ్డు పై భైఠాయింపు
-sustainable-development