పాకిస్థాన్ కుట్ర-సిక్కుయువతకు గాలం

దశాబ్దాల క్రితం ఖలిస్తాన్ పేరుతో పంబాబ్ లో జరిగిన మారణహోమం అందరికీ గుర్తుండే ఉంటుంది. పంజాబ్ లో నాడు ఉగ్ర కార్యకలాపాలను ఎగదోసి ఆ మంట్లోల చలినికాల్చుకున్న పాకిస్థాన్ ఇప్పుడు మరోసారి సిక్కులను భారత్ కు వ్యతిరేకంగా ఉసిగొల్పే ప్రయత్నాలు చేస్తోంది.
దీనికోసం పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ సంస్థ పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నట్టు భారత పార్లమెంటరీ బృందం వెల్లడించింది. అమెరికా,యూరప్, కెనాడాల్లో నివసిస్తున్న సిక్కులను రెచ్చగొట్టే చర్యలను చేయడం ద్వారా పాక్ దేశంలో ఆశాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆ నివేదికలో పేర్కొన్నారు.
విదేశాల్లో ఉద్యోగాలు లేకుండా ఉన్న యువతను లక్ష్యంగా చేసుకున్న పాకిస్థాన్ వారికి డబ్బును ఇతర ప్రయోజనాలను ఎరవేస్తూ వారిని భారత్ పైకి ఉసిగెల్పే చర్యలకు దిగుతోంది. సిక్కు యువకులను తమవైపు తిప్పుకునేందుకుగాను సామాజిక మాధ్యమాలను పెద్దఎత్తున వినియోగించుకుంటున్నట్టు విచారణలో తేలింది.
కాశ్మీర్ లో భద్రతాదళాలపై రాళ్లు విసిరేవారికి పెద్ద మొత్తంలో నిధులు అందుతున్నట్టు తేలింది. ఈ పనులకు గాను చిన్న పిల్లలను ఎంపికచేసుకుని వారిని ముందుంచి బలగాలపై రాళ్లను విసురుతున్నారు.
pakistan, cenada, europe, sikh youth, punjab.