భారతదేశం -మత మార్పిడులు

(పి.విజయరాఘవన్ ప్రత్యేక వ్యాసం)
రచయిత పి.విజయరాఘవన్ వృత్తి రిత్యా ప్రముఖ ఆర్థిక నిపుణుడు. సామాజిక అంశాలపై పరిశోధనలు చేయడం అతనికి ఇష్టమైన వ్యాపకం. పలు సామాజిక అంశాలపై అనేక వ్యాసాలు రాశారు
.

ప్రస్తుత వ్యాసం భారతదేశం – మత మార్పిడులు అనే అంశాన్ని సహేతుకంగా వివరించడానికి ప్రయత్నిస్తుంది. ఎలాంటి భావజాల ప్రదర్శన చేయకుండా రచయిత కేవలం వేదం కాలం నుండి ఇప్పటివరకు జరిగిన విషయాలని మీ ముందుంచాడనికి చేసిన ఒక ప్రయత్నం. పురాణోపాఖ్యానాలని చారిత్రిక ఆధారాలని క్లుప్తంగా ఒక క్రమంలో పేరుస్తూ నిజాలని నిర్ద్వంద్వముగా మీ ముందు ఉంచుతుంది. ముందుగా చెప్పినట్టు రచయిత ఇందులో ఎవరిని ఉద్ద్దేశించి కాకుండా మత మార్పిడులకు సంబంధించి కారణ విశ్లేషణ చేస్తుంది.
మతపరమైన సామరస్యం, లౌకికవాదం వంటి భారతీయ విలువలకు వ్యతిరేకంగా మత పునరుజ్జీవనం మరియు మతపరమైన భావన నేడు మన దేశాన్నిపట్టుకుని ఉన్నాయి. మతపరమైన మార్పిడి ఒక సున్నితమైన, సమస్యాత్మకమైన అంశంగా మారింది.
భారతదేశంలో మత స్వాతంత్ర్యం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25-28 ద్వారా ఒక ప్రాథమిక హక్కు. ఆధునిక భారతదేశం 1947 ఉనికి లోకి వచ్చాక భారతదేశం లౌకిక రాజ్యం అని 1976 లో రాజ్యాంగం యొక్క ఆవరణ సవరించబడింది. భారతదేశంలోని ప్రతి పౌరుడు వారి మతాన్ని శాంతియుతంగా పాటిస్తూ మరియు ప్రోత్సహించే హక్కు కలిగి ఉన్నారు.
భారతీయ సమాజానికి మార్పిడి అనేది కొత్తది కానప్పటికీ, గతంలోనే అది చాలా లోతుగా పాతుకుపోయింది, అది రాజకీయ, సాంస్కృతిక, సాంఘిక సమస్యలను సృష్టిస్తోంది. అయితే దీనికి ముఖ్య కారణాలు ఎన్నైనా ఉన్నప్పటికీ ఒక ప్రధాన ప్రచారం లేదా నిజం మాత్రం కుల వ్యవస్థలో క్రమేపి ఏర్పడ్డ అసమానతలు. అందుకే ముందుగా భారతదేశంలో మత మార్పిడులకు దోహదపడ్డ అంశాలని పరిశీలిద్దాం.
హైందవం అనేది మతం కాదు. చారిత్రకంగా హిమాలయాల నుంచి హిందూ మహా సాగరం మధ్యలో ఉన్న భూభాగంలో నివసించే వారినందరిని హిందువులు అన్నారు. భరత చక్రవర్తి పాలించిన ప్రదేశం కాబట్టి భారత దేశం అని పిలువబడింది. హైందవం అనేది ఒక ధర్మం అనగా ఇక్కడ నివసించే ప్రజలు ఏ రకంగా జీవించాలి, ఏ పద్ధతులు సాంప్రదాయాలు పాటించాలి, ఏ సంస్కృతి పరిఢవిల్లాలి, దేవతారాధన మరియు క్రతువుల ఎలా చేయాలి, ముఖ్యంగా దేశాన్ని ఎలా పాలించాలి, సమాజంలో మనిషి విలువ ఏంటి, అతను మిగతా వారితో ఎలా ప్రవర్తించాలి, సమాజానికి ఎలా తోడ్పడాలి, కలిసి సంఘజీవనం చేస్తున్న జంతువుల పట్ల, భూమి పట్ల అనుసరించవల్సిన విధానాలు చెప్పబడ్డాయి.
అందులో భాగంగా వర్ణాశ్రమ ధర్మాలు వెలువడ్డాయి. వర్ణాశ్రమ ధర్మాలని పరిశీలిస్తే ఎక్కడ కూడా ఎవరిని కించ పరచలేదు అనే విషయం స్పష్టమౌతుంది. హిందూ ధర్మాన్ని హిందూ మతంగా మార్చడంతోటే అవి క్రమేపి కులాల మాదిరిగా రూపాంతరం చెందడం తరువాత స్వార్ధ ప్రయోజనాలకు వాడుకోబడడం ఎలా జరిగాయో ఇప్పుడు చూద్దాం .
వేద కాలం
ఈ వర్ణాశ్రమ ధర్మాల గురించి భాగవతంలోను, రుగ్వేదం లోను, మను సంస్కృతిలోను వివరించబడింది. జననం ద్వారా కుల వివక్షత, హిందూ మతం యొక్క ప్రాథమిక లక్షణాలలో ఒకటిగా భావించబడుతోంది, కానీ వేద గ్రంథాల లో ఆలా లేదు. అన్నిటిలోకి ప్రామాణికంగా భగవత్ గీత లో శ్రీ కృష్ణ పరమాత్మా ఎం చెప్పారో పరిశీలిద్దాం. భగవత్ – గీత (4.13) లో కృష్ణుడిచే వివరించబడిన అసలు సామాజిక వ్యవస్థ:
“చతుర్ – వర్ణయం మాయ శ్రీష్టం గుణ – కర్మ- విభాగశహ్”
భౌతికమైన స్వభావం మరియు వారితో సంబంధం ఉన్న మూడు పద్దతుల ప్రకారం, మానవ సమాజంలోని నాలుగు విభాగాలు నా నుండి సృష్టించ బడ్డాయి. ఎందుకంటే మానవులలో కృష్ణుడు వర్ణాలు అని పిలవబడే విభాగాలను సృష్టించారు, వారు ఏ సమాజం లోనైనా సహజంగా ఉంటారు. ఒకే వర్గంగా భావించబడే కమ్యూనిజం కూడా పాలక వర్గం మరియు సాధారణ కార్మికుల మధ్య అపారమైన అసమానతలను కలిగి ఉంది.
శ్రీకృష్ణ పరమాత్మ ఒక వ్యక్తి యొక్క వర్ణం నిర్దేశించేది అతని పుట్టుక కాదు అది అతని “గుణం” లేదా “స్వభావం” మరియు “కర్మ” లేదా అతను చేసే పని “రకం” లేదా “నాణ్యత” ద్వారా ఏర్పడుతుంది అన్నారు. అయితే ఇక్కడ ముఖ్యముగా గమనించవలసినది సమాజంలో మనుషులు 4 తరగతులుగా విభజించ బడ్డారు:
బ్రాహ్మణులు: భగవత్ గీత (18.42) సంక్షిప్తంగా బ్రాహ్మణుల వర్ణాలను నిర్వచిస్తుంది: “శాంతి, స్వీయ నియంత్రణ, కాఠిన్యం, స్వచ్ఛత, సహనం, నిజాయితీ, జ్ఞానం, మరియు వివేకం. ఇవి బ్రాహ్మణ సహజ లక్షణములు. బ్రాహ్మణులు సమాజ ఉపాధ్యాయులు వారి జ్ఞానంతో వారు సమాజాన్ని సరైన దిశలో, స్వీయ-గ్రహింపు వైపుకు మార్గనిర్దేశం చేస్తారు. పౌరుల ఆధ్యాత్మిక పురోగతిని నిర్ధారించడానికి ఎలా పాలించాలో క్షత్రియులకు బ్రాహ్మణులు సలహా ఇస్తారు. క్షత్రియలు సమాజంలో నాయకత్వం వహించడానికి బ్రాహ్మణులు వారి దౌత్య నైపుణ్యాలను ఉపయోగిస్తారు. అధికారం, సంపద, గౌరవం, మరియు వారి పని, వీలైనంతవరకూ వీటిపై ఆసక్తి లేకుండా, బ్రాహ్మణులు తమ బోధన కోసం జీతం అందుకుంటారు లేదా యాచించి జీవిస్తారు. వారు అవసరం లేకుండా సంపదను కూడబెట్టుకోరు. వారు పరమాత్మపై పూర్తిగా ఆధారపడి బ్రతుకుతారు. ఇతర వర్ణాల ప్రజలు వారికి మద్దతుగా ఉంటారు.
క్షత్రియులు: నాయకత్వము, వీరోచితం, అధికారం, సంకల్పం, సమృద్ధి, యుద్ధంలో ధైర్యం, ఉదారత క్షత్రియుల సహజ లక్షణములు. (భగవత్ గీత 18.43). బ్రాహ్మణుల యొక్క సూచనల ప్రకారం, క్షత్రియ ప్రజలు పౌరులను కాపాడటానికి మరియు శాంతిని మరియు క్రమమును కాపాడుటకు బాధ్యతను కలిగి ఉన్నారు. క్షత్రియుల యొక్క అత్యంత ముఖ్యమైన విధుల్లో ఒకటి, పౌరులు మానవ జీవితం యొక్క ఉద్దేశ్యాన్ని తెలుసుకుని, వాటిని నెరవేర్చడానికి సహాయపడే విధులు నిర్వహిస్తారు. ఇది చేయటానికి, ఆ క్షత్రియుల తాము రాజర్షులుగా ఉండాలి. ఆదర్శ రాజర్షి యొక్క ఉదాహరణ శ్రీ రాముడు, ఆయన పాలన లో, ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా, భౌతికంగా సంతృప్తి చెందారు, మరియు ఆధ్యాత్మికంగా పురోగతి సాధించారు.
వైశ్యులు: వ్యవసాయం, ఆవులు పసు రక్షణ మరియు వ్యాపారాలు వైశ్యులు కోసం సహజమైనవి. వ్యాపారం చేసి ఆహరం ఉత్పత్తి చేస్తారు. వైశ్యులు ఆవులను కాపాడతారు. సమాజం యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక మనుగడ కోసం ఆవు రక్షణ అవసరం. ఆవు రక్షణ వల్ల కరుణ అభివృద్ధి చెందుతుంది, మరియు ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవడానికి పాలు మెదడు యొక్క సూక్ష్మ కణజాలంను పెంచుతుంది.
శుద్రులు: ఈ తరగతి ప్రజలు ముఖ్యముగా సమాజంలో మిగతా పనులు చేసేవారు. వీరు సాధారణంగా శ్రామికులు మరియు కర్షకులు. వీరిలో విద్యా ఉన్నతులు ఆధ్యాత్మిక గురువు మార్గదర్శకంలో ఆధ్యాత్మిక పరిపూర్ణత యొక్క అత్యుత్తమ వేదికను సాధించ గలరు. ఇందుకు రామానుజాచార్య యొక్క గొప్ప భక్తుడు కాంచీపుర్న జన్మతః ఒక శూద్రుడు. వీరు వృత్తిపరమైన బాధ్యతలను నమ్మకంగా నిర్వహిస్తారు.
వర్ణాశ్రమం వ్యవస్థ చాలా దృఢమైనది అది అణచివేతకు తావీయదు. ఏ జాతి వాడైనా బ్రాహ్మణ లక్షణాలు జ్ఞానము ప్రదర్శిస్తూ ఉంటె అతని బ్రాహ్మహనుడుగానే చూడబడతాడు. మరోవైపు, ఉన్నత కుటుంబంలో జన్మించినా సరైన లక్షణాలు లేని వ్యక్తి బ్రాహ్మహనుడుగా పరిగణించబడడు. దీనిని బట్టి నిర్ణయాత్మక కారకాలు ఒకటి లక్షణాలు మరియు అతను పొందే విద్యా శిక్షణ! అనగా ఈ వర్ణాశ్రమ ధర్మం పుట్టుక అనేది ఏ కోశానా అతని కులానికి ప్రాతిపదిక కాదు అని తెలుపుతుంది.
ఉదాహరణకు, ఒక పురాణోపాఖ్యానం గమనిస్తే కృష్ణుడి అవతారమైన రిషభదేవ ఒక రాజు, అందువలన అతని వంద మంది కుమారులు ఒక క్షత్రియ కుటుంబంలో జన్మించారు. కానీ, వీరిలో పది మంది క్షత్రియులుగా వ్యవహరించారు మరియు దేశాన్ని పాలించారు. తొమ్మిది మంది కుమారులు శ్రీమాద్-భాగవతం యొక్క మంచి బోధకులయ్యారు, మరియు వారు బ్రాహ్మణులగ పరిగణింపబడ్డారు.
వర్ణాశ్రమం వ్యవస్థను ఒక సామాజిక సంస్థతో పోల్చవచ్చు. సమాజాన్ని ఒక శరీరంతో పోలిస్తే జ్ఞానంతో ఉన్న బ్రాహ్మణులు తల, కళ్ళు మరియు మెదడుతో పోల్చవచ్చు; రక్షణ అందించే క్షత్రియలు, భుజాలు మరియు చేతులు; కూర్చొని వ్యాపారం చేసి సమాజానికి మద్దతు ఇచ్చే వైశ్యులు, కడుపు మరియు తొడలు గా; మరియు శుద్రులు కాళ్ళు గ పరిగణింపబడ్డారు.
ఈ సామాజిక శరీరాన్నే భగవంతుడుగా కూడా భావించారు. ఇక్కడ గమనించ వలసిన విషయం ఏంటంటే అన్ని వర్ణాల ప్రజలకి సమాన ప్రాముఖ్యత ఇవ్వబడింది. బ్రాహ్మణులు అందించే మార్గదర్శకత్వం కారణంగా క్షత్రియులు సమర్థ రాజ్యపాలన చేయగలిగారు. శూద్రుల శ్రమ లేకుండా సమాజంలో ఏపని జరగదు మరియు జీవించడానికి అవసరమైన అన్నమే దొరకదు. కర్షకులు మరి కాళ్లతోనే దుక్కి దున్ని పొలాన్ని పండిస్తారు. కుమ్మరి వారు కాళ్లతో మట్టిని తొక్కే వంటలు చేసుకోడానికి అవసరమయ్యే కుండలు తయారు చేస్తాడు. అందుకే అలంటి పనులు చేసేవారందరికి కాళ్ళు బలముగా సూచించబడ్డాయి. వైశ్యుల మద్దతు లేకుండా, బ్రాహ్మణులు తమ సమయాన్ని బోధించడానికి మరియు చదువుకోడానికి కేటాయించలేరు. క్షత్రియుల నుండి రక్షణ మరియు భూమి లేకుండా, వైశ్యులు వారి పనులు చేయలేరు. అందుకే సామాజిక శరీరం యొక్క ప్రతి భాగం దాని సరైన పనితీరును ప్రదర్శించినప్పుడు, మొత్తం సమాజం శాంతియుత మరియు సహకార మయము చెయ్యవచ్చు
పురాతన యుగం – మధ్య యుగం (క్రీ. పూ 1500 – క్రీ. శ 1500)
సమాజంలోని అన్ని తరగతులు లేదా వర్ణాల వాళ్ళు సమానంగా నిర్వచించ బడ్డప్పుడు మరి బేధాలు ఎప్పుడు ఎలా ఎవరు సృష్టించారు అనేది చూద్దాం. దురదృష్టవశాత్తు ఈనాటి సమాజం లో ఎక్కడో మారు మూల ప్రాంతాలలో తప్ప అంటరానితం లేదా అణచివేత లేదు. ఈ విషయం అందరికి తెలుసు ఐనా కొంతమంది పనికట్టుకొని వైషమ్యాలు పెంచి పోషిస్తున్నారు.
భారతదేశంలో కుల వ్యవస్థ క్రీ. పూ. 1200 సంవత్సరం దక్షిణ యూరప్ మరియు ఉత్తర ఆసియా నుండి తెలుపు రంగు చర్మం ఒడ్డు పొడవు సరసమైన శరీరం గల ఆర్యుల రాకతో మొదలైంది. అప్పటికే భారత దేశంలో ద్రావిడ, మంగోలియ, ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా జాతులకి సంబందించిన వారు అనాదిగా మనుగడ సాగిస్తున్నారు.
ఆర్యులు ఉత్తర భారతదేశంలో ప్రాంతాలను స్వాధీనం చేసుకుని, ఆక్రమించుకోవడం ప్రారంభించారు, అదే సమయంలో దక్షిణ భారతదేశంలోని దక్షిణాన లేదా ఉత్తర భారతదేశంలోని అరణ్య మరియు పర్వతాల వైపుకు వెళ్లారు. వారు స్థానిక సంస్కృతులను పట్టించుకోలేదు. అప్పటివరకు ఉన్న వర్ణాశ్రమ ధర్మాలను వారికి కావాల్సిన విధంగా మార్చుకొని ప్రాంతీయులని అణచి వేయడం మొదలు పెట్టారు.
వారు రెండు భాగాలుగా విడిపోయి ఒక వర్గాన్ని రాజయాన్ లేదా క్షత్రియగా మరొక వర్గాన్ని పూజారులు మరియు బ్రాహ్మణులు అని పిలిచేవారు. నాయకత్వం కోసం ఈ రెండు వర్గాలు రాజకీయంగా పోరాడాయి. ఈ పోరాటంలో బ్రాహ్మణులు సమాజానికి నాయకులుగా ఉన్నారు. ఇక వీరు ప్రాంతీయ ప్రజలని మూడవ బృందంగా చేసారు. వారితో కలవని ప్రాంతీయ బ్రాహ్మణ క్షత్రియ, కర్షకులు, వైస్యులు, ఇతర పని వాళ్ళు ఉన్నారు. వీరిని ముఖ్యంగా పై రెండు బృందాలకు సేవకులు గా చేసుకున్నారు. ఆర్యులు కొన్ని సాంఘిక మరియు మతపరమైన నియమాలను తుంగలో తొక్కారు.
అప్పటివరకు హైందవ సమాజంలో పవిత్రమైన జంతువుగా భావించే ఆవుని చంపడం తినడం మొదలు పెట్టారు. ప్రాంతీయులతో కూడా అదే పని బలవంతంగా చేయిన్చేవారు. క్రమేణా ఈ పనులు కొన్ని తరగతుల వారికి ముక్యముగా మనిషి చర్మం రంగుతో వేరు చేసి (వర్ణాన్ని రంగు అని వక్రీకరించి ) ముదురు రంగు చర్మం గల వారిని ఈ పనుల బారిన పడేసారు. హైందవ సమాజము లో ఇప్పటికి జంతువవుల చర్మం వలచడము వంటి పనులు కొంతమందే చేస్తున్నారు.
అంతే కాకుండా అత్యంత దయనీయ దుర్భరమైన పనులు కూడా వారితో చేయిన్చడం మొదలు పెట్టారు ఉదాహరణకి పరుల మాలమూ త్రాదుల శుభ్రన. ఈ రోజుల్లో కూడా కొంతమంది మురుగులో దిగి శుభ్రంచేయడం చేయాల్సివస్తుండడం చాలా బాధాకరం.
ఎప్పుడైతే వారిని సేవకులుగా చేసి ఇలాంటి పనులు చేయిన్చడం మొదలు పెట్టారో మనుషులని కులాలుగా విభజించడం మొదలు పెట్టారు. ఈ పనులు చేసేవారిని అధమ కులాలుగాను తమను తాము అగ్ర కులాలుగాను నిర్ణయించారు. సహజం గానే లేక అపవిత్ర పనులు చేస్తున్నారనో వీళ్ళని పవిత్ర ఆలయాలలోకి రానిచ్చేవారు కాదు. ఊరికి దూరముగా ఉంచేవారు. ఇలా మనుషులని వారు చేసే పనులని బట్టి కులాలు గా వర్గీకరించి తదుపరి అణచివేయడము జరిగింది.
అయితే వక్రీకరణ ఎక్కడ ఎలా జరిగిందో చూద్దాం! మొదటగా వర్ణము అనగా పైన వివరించిన దాని ప్రకారం కానీ సంస్కృత పరముగా “తరగతి” అని స్పష్టమౌతోంది. కానీ కాల క్రమేణా వర్ణము అనగా రంగు అని అది ముదురు రంగు చర్మం కల వారు అని వక్రీకరింపబడింది. అంటే మనిషి చర్మపు రంగుని బట్టి కుల విభజన జరపడం మొదలు పెట్టారు.
ఇంకొక వక్రీకరణ శూద్రులని ముందుగానే అణచి వేశారు అనే దానికి ఉదాహరణగా అందరు భగవంతుని అతి మఖ్యమైన శరీర భాగాలనుండి ఉద్బవిస్తే శూద్రులని మాత్రము పాదాల నుండి సృష్టించారు లేదా సూచించారు అన్నారు. కానీ దీనికి ప్రాతిపదిక ముందుగానే చెప్పబడడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే అందరు శరణు కోరేది ఆ భగవంతుని పాదాలే అనే విషయం విస్మరిస్తున్నారు. ఆ విధంగా చూసినా శూద్రులకి ఉన్నత స్థానమే లభించింది.
అయితే ఈ బేధభావాలను ఎప్పటిక్కప్పుడు హైందవ ధర్మ సంస్థాపకులు లేదా ఆచార్యులు నిరసిస్తూ వచ్చి సమాజానికి మార్గదర్సకత్వం చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకి ఇదే సమయంలో జన్మించిన (క్రీ. పూ. 509) శంకర భగవత్పాదుల ఉదంతం: ఒక నాడు గంగా స్నానం చేసి వస్తున్న శంకరులకు ఒక నిమ్న జాతీయుడు తన నాలుగు కుక్కలతో దారికి ఎదురుగా వచ్చాడు అది చూసి శంకరులు ప్రక్కకు తొలగు అన్నారు. అప్పుడు అతగాడు ఇలా అన్నాడు
“अन्नमयात् अन्नमयं अथवा चैतन्यमेव चैतन्यात् ।“
నువ్వు తినే అన్నం తోనే తయారయ్యి అదే విధంగా పనిచేసే ఈ శరీరాన్ని జరగమంటున్నావా లేక సర్వగతమై నాలోనూ నీలోను ఉన్న చేతన్యాన్ని జరగమన్నావా? దానితో శంకరులకు ఆత్మ జ్ఞానం కలిగి అందరిలోనూ సత్యమై ఉన్నది ఆత్మనే అది ఒక మనిషిని బ్రాహ్మహనుడనో లేక నిమ్న కులస్తుడనో విడదీయలేదు. అతను జన్మతః కడు జాతివాడైన (ఆర్యుల వర్గీకరణ) పూజనీయుడే అని చాటారు. అదే వర్ణాశ్రమ ధర్మ భావం!
అలాగే మధ్యయుగ కాలం క్రీస్తు శకం 5 నుండి 15 వ శతాబ్దం లో ఈ వక్రీకరణలు అణచివేతలు తారాస్థాయికి చేరుకున్నాయి . అదే సమయంలో వీటిని తీవ్రముగా నిరసించిన ఇంకొక ఉదంతం శ్రీ రామానుజ చార్యుల (క్రీ. శ. 1017 – 1137) వారి జీవితంలో జరిగింది.
వృద్ధులైన రామానుజులు తన రోజువారీ స్నానం కోసం నదికి వెళ్లినప్పుడు వెళ్లేప్పుడు బ్రాహ్మణ శిష్యుడితో వెళ్లి వచ్చేప్పుడు మాత్రం శుద్ర శిష్యుడైన కాంచిపుర్ణ సహాయంతో వచ్చేవారు. అగ్రహారా బ్రాహ్మలకు ఇది నచ్చక ఆయనని నిలదీశారు. వారి అజ్ఞానాన్ని (ఆర్య వర్గీకరణ) పోగొడుతూ ఇలా ఉన్నారు నేను స్నానికి వెళ్ళినప్పుడు నాపై ఉన్న ధూళిని మాత్రమే కడుగుకున్నాను అదే కాంచిపుర్ణ బుజం మీద చేయివేసినప్పుడు నాలోని అహంకారాన్ని పోగొట్టుకొంటున్నా ఏదైతే నీటితో కడిగివేయబడదో!
ప్రస్తుతం, కాంచీపురం వద్ద కాంచిపుర్ణ కి ఆలయం ఉంది, ఇప్పుడు అతనిని ఒక గొప్ప గురువుగా పూజిస్తారు. అంతే కాక సమాజంలో ఉన్న అసమానతలు తొలగిస్తూ రామానుజులవారు దేవ మంత్రాన్ని అందరికి జాతి బేధం లేకుండా ఉపదేశించి అందరు ఒక్కటే అని చాటారు. (నిజమైన వర్ణాశ్రమ భావం).
ఆధునిక యుగం (క్రీ. శ 1500 – ఇప్పటి వరకు)
మతం యొక్క అత్యంత విభిన్న దేశాలలో భారతదేశం ఒకటి, ఇది నాలుగు ప్రధాన ప్రపంచ మతాల జన్మస్థలం: హిందూమతం, జైనమతం, బౌద్ధమతం మరియు సిక్కుమతం. భారతదేశం, దాని సాంప్రదాయ సహనం తో, వేరే చోట్ల పీడన ఎదుర్కొన్న సంఘాల కోసం ఒక ఆశ్రయంలా పనిచేసింది.
క్రీస్తు పూర్వము 2500 సంవత్సరాల క్రితం యూదులు, 68 లో సెయింట్ థామస్ క్రైస్తవులు, 700 నుంచి 1500 వరకు ముస్లిములు, 1500 నుంచి 1900 వరకు పోర్చుగీస్ ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వారు భారత దేశానికీ రావడము వారి మత ప్రచారాలు మార్పిడులు చేయడం జరిగింది. తరువాత బౌద్ధులు మరియు ఇరాన్ బహాయీ ముస్లిములు భారతదేశం లో ఆశ్రయం పొందారు. అదే సమయంలో మత మార్పిడులకుకూడా గురైంది.
భారతదేశంలో మతమార్పిడుల చరిత్ర
ఇస్లామిక్ సైన్యాల దాడి భారత సామాజిక నిర్మాణంలో పెను సంచలనాలు రేపింది. క్రీస్తు అనుచరులు దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా కేరళ మరియు తమిళనాడు తీర ప్రాంతాల్లోకి వచ్చిన వెంటనే క్రైస్తవ మతం భారతదేశంలోకి వచ్చింది.
ఇస్లాము: ముహమ్మద్ ఖాసిమ్ తో 712 సంవత్సరంలో మొదలయ్యి ఔరంగజేబ్ తో పరాకాష్టకు చేరుకుంది. ఈ కాలంలో, హింసాత్మకమైన మార్పిడులు, దేవాలయాల కూల్చివేత, ఆవులు చంపడం మరియు హతమార్చడం వంటి హిందూ వ్యతిరేకచర్యలు ఒక పరాకాష్టకు చేరుకున్నాయి. టిప్పు సుల్తాన్ మలబార్ ప్రాంతంలో ఒక లక్ష మంది హిందువులని బలవంతంగా ఇస్లాంకు మార్చాడు. అతను కర్నాటకపై దాడి చేసినప్పుడు, ఒక రోజులో అతను 50,000 మంది హిందువులు ఇస్లాం మతానికి మార్చాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇస్లామీకరన నిజాం హాయం వరకు కొన సాగినట్టు తెలుస్తోంది.
క్రైస్తవ మతం: భారతదేశంలో పోర్చుగీస్, ఫ్రెంచ్, డచ్ మరియు బ్రిటిష్ వల్ల క్రైస్తవ మతం విస్తరించింది. క్రైస్తవాన్ని స్థాపించిన మొదటి శతాబ్దంలో (క్రీ.శ. 52), సెయింట్ థామస్, ఒక క్రైస్తవ మిషనరీ భారత్లో కేరళలో అడుగుపెట్టి క్రైస్తవ మతాన్ని బోధించటం మొదలుపెట్టారు. ఈ కాలంలో హిందువుల అత్యధిక మార్పిడులు జరిగాయి. భారత్లో కాశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ; పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, కంబోడియా మరియు బర్మా, అప్పుడు భారత్లో భాగంగా ఉండేవి, అవి మతమార్పిడులను చాలా మటుకు భరించాయి.
1498 లో భారత్లో వాస్కో-డా-గామా నాయకత్వంలో పోర్చుగీస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. దీనితో క్రైస్తవుల సామ్రాజ్యవాద దృక్పథాల రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. క్రైస్తవ మిషనరీలు వెంటనే వాస్కో-డా-గామాను అనుసరించారు. తరువాత, పోర్చుగీస్ యొక్క ప్రధాన లక్ష్యం వారి సామ్రాజ్యం వాణిజ్యం ద్వారా కాకుండా క్రైస్తవ మతం వ్యాప్తి చెందింది. ఈ పరిస్థితిలో మార్పిడులు మొదలయ్యాయి.
1757 లో బెంగాల్ రాష్ట్రంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన స్థాపించబడింది. తరువాత 18వ శతాబ్దం చివరలో, చార్లెస్ గ్రాంట్ యొక్క ప్రతిపాదనపై పార్లమెంటులో ఎనిమిది రోజులు నిరంతర చర్చలు జరిగాయి, క్రైస్తవ మిషనరీలు వారి మతాన్ని ప్రచారం చేయడానికి అనుమతి పొందారు. భారత్లో బ్రిటీష్ అడుగుపెట్టిన తర్వాత, భారత్లో ప్రజలకు అవగాహన కల్పించే భాష గురించి ఆలోచించినప్పుడు, బ్రిటిష్ విద్యావేత్త మకాలే తన తండ్రికి ఇలా రాశాడు, ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం చేస్తున్న హిందువులు తమ ధర్మంతో ఎన్నటికీ కలిసి ఉండరు. తరువాత హిందూ కాని హిందువులు హిందూ ధర్మం తప్పు అని క్రైస్తవ మతాన్ని స్వీకరించడం మొదలుపెడతారు.
మతమార్పిడుల ప్రధాన ఉద్దేశం ఏమిటి ?
భారత్ క్రైస్తవీకరణ : క్రైస్తవ దేశాల ప్రధాన ఉద్దేశం భారత దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడం. దీనికి అనుగుణంగా ప్రాజెక్ట్ క్రిస్ట్ ఇండియా స్థాపించబడింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో హిందువులని క్రైస్తవులగా మార్చడానికి క్రైస్తవ మిషనరీలు భారత్లో చురుకుగా పని చేస్త్తున్నట్టు తెలుస్తోంది. ఈ వాస్తవానికి ఎన్నో సాక్ష్యాలు పత్రికాముఖంగా ఉన్నాయ్ కావున ప్రస్తావించటం లేదు.
భారత్ ఇస్లామీకరణ: ఇస్లాం మతం మానవ జాతిని రెండు ‘ దరుల్-ఇస్లాం (ఇస్లామిక్ దేశాల ప్రపంచం)’ మరియు దరుల్-హరాబ్ (ఇస్లామిక్ కానీ అన్య మత దేశాలు) ‘గా విభజించింది. దరుల్-హరాబ్ దరుల్-ఇస్లాంగా మారేవరకు ఇస్లామీకరణ మత యుద్ధ రూపంలో ప్రపంచంలో జరుగుతున్న విషయం తెలిసినదే.
బౌద్ధం: భారత్ను ఒక బౌద్ధ దేశంగా తయారు చేయడానికి, చైనా నుండి భారత్ లో ఈశాన్య రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలలో డబ్బు ప్రవహిస్తూ, హిందువులను మార్చడం జరుగుతున్నట్టు తెలుస్తోంది.
మతం ఎందుకు మార్చుకోవడం జరుగుతోంది?
సమాజంలో ఆర్యుల వల్ల తదుపరి స్వార్థపరులైన మూఢుల వల్ల ఏర్పడ్డ అసమానతల వల్ల దిగువ స్థాయిగా పిలవబడుతున్న సమాజం విదేశీ మిషనరీల ద్వారా ఆకర్షించబడుతోంది. మా మతానికి మారడం ద్వారా మీకు ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ప్రమోషన్లు మరియు కొంతవరకు సాంఘిక హోదా కలుగుతుందని నమ్మించడంలో విజయం సాధించ గలుగుతున్నారు. ఈ మార్పిడులలో ఎక్కువగా డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తోంది. అంతే కాకుండా ఉద్యోగ రీత్యా కలిగే ప్రయోజనాలు మరియు విడాకులు కోసం, బహుభార్యాత్వం కనిపించే ఇతర కారణాలు.
ఇటీవల కాలంలో, తమిళనాడులో వందలాది నిమ్న కుల ప్రజలు ఇస్లాంకు మారారు. ఈ విషయం భారతదేశం అంతటా గొప్ప ప్రచారం మరియు ఆకర్షణను పొందింది. ఒరిస్సా లోని గంజన్ జిల్లాలోని కూత్ గ్రామంలో మరియు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో, వేల సంఖ్యలో నిమ్న కుల లేదా తెగ ప్రజలు క్రైస్తవ మతానికి మారారు. ఈ సామూహిక మార్పిడి సంచలనాన్ని సృష్టించి ప్రజల దృష్టిని ఆకర్షించింది.
సమానత్వం కోసం వారి దీర్ఘకాల పోరాటంలో, భారతదేశపు అణగారిన వర్గాల ప్రజలు, ఇస్లాం, క్రైస్తవం, లేదా బౌద్ధం వైపు తమ హిందూవాదాన్ని తరచుగా మార్చుకుంటున్నారు. వారు అలా చేయడం ద్వారా వారి జీవితాలు మెరుగు పడతాయి అని కుల వ్యత్యాసాలు తొలగి సామజిక ఉన్నతి కలుగుతుందని వారు ఒప్పిస్తున్నారు. అలాగే ఆపత్సమయాల్లో సహాయం అందించే నిమిత్తంకుడా మత మార్పిడులు జరుగుతున్నాయి. దీనికి చెన్నై వరదలు ప్రత్యక్ష సాక్ష్యం.
స్థూలంగా పరిశీలిస్తే భారత సమాజంలో హైందవ ధర్మం లో ఎలాంటి అణచివేత లేదు అనేది తేటతెల్లమైంది. ఎక్కడో మారుమూల విద్య పరంగా వెనుకబడ్డ ప్రాంతాలలో తప్ప ఎక్కడ ఎలాంటి అణచివేత లేదనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికి కొంతమంది స్వార్థపరులు పైన చెప్పిన మాత మార్పిడి ప్రధాన ఉద్దేశాలకు ప్రతినిధులుగా పనిచేస్తూ వైషమ్యాలు ప్రజల మధ్య దూరాన్నిపెంచుతూ , అణగారిన జనాలని రకరకాలుగా ప్రలోభ పెడుతూ మత మార్పిడులు ప్రోత్సహిస్తూనే ఉండడం నిజంగా చాలా బాధాకరం. మొత్తానికి మత మార్పిడులకు ప్రధాన కారణాలు రాజకీయం, సామాజికం మరియు ప్రధానంగా ఆర్ధిక ప్రయోజనాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *