అరుదైన గుడ్లగూబ కళ్లుపొడిచిన మంత్రగాళ్లు

0
79

హైదరాబాద్ లో మరోసారి క్షుద్రపూజల ఆనవాళ్లు బయటికి వచ్చాయి. మానబ్ ట్యాంక్ సమీపంలో ప్రాణాపాణ స్థితిలో ఉన్న అరుదైన జాతికి చెందిన గుడ్లగూబను స్థానికులు కనుగొని జంతు,పక్షి సంరక్షకులకు సమాచారం ఇచ్చారు. గుడ్లగూబపై పసుపు, కుంకుమలు చల్లిరనట్టు ఆనవాళ్లు ఉండడంతో పాటుగా దాని రెండు కళ్లను అత్యంత కిరాతకంగా పొడిచేశారు. దీనితో కళ్లు కనబడని స్థితికి చేరుకున్న గుడ్లగూబను బయటకు వదిలేసినట్టు కనిపిస్తోంది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ లో క్షుద్రపూజల ప్రకంపనలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవలే చంద్రగహణం రోజున ముడునెలల చిన్నారిని ఉప్పల్ చిలుకూనగర్ ప్రాంతంలో బలిఇవ్వాగా తాజాగా మరో సంఘటన బయటికి వచ్చింది.
నగరంలో లెక్కకు మిక్కిలిగా ఉన్న మంత్రగాళ్లు అమాయకులను ఇటువంటి దారుణాలవైపు పురిగొల్పుతున్నారు. తమ కష్టాలు తీరతాయనే నమ్మకంతో ఎంతటి దారుణాలకైన తెగబడుతున్నారు. వీటిలో కొన్ని మాత్రమే బయటికి వస్తుండగా చాలా విషయాలు నాలుగుగోడల మధ్యనే సమాధి అవుతున్నాయి. అత్యంత అరుదైన జాతికి చెందిన గుడ్లగూబ కళ్లను పొడిచేసి వైనం మంత్రగాళ్ల కిరాతకాలను మరిసారి వెలుగులోకి తెచ్చింది. అరుదైన పక్షి, జంతువుల అమ్మకాలను ప్రభుత్వం నిషేధించినప్పటికీ అరుదైన పక్షులను విక్రయించే ముఠాలు నగరంలో చాలానే ఉన్నాయి. ప్రజల నమ్మకాలే పునాదిగా రెండు తలలపాములు, ఉడుములు, గుడ్లగూబలు లాంటి వాటిని దొంగచాటుగా విక్రయిస్తున్నారు. చార్మినార్ సమీపంలోని ముర్గిచౌక్ తో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో వీటి విక్రయిం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here