గరిష్ట స్థాయికి చేరుకున్న చమురు ధరలు

ఇరాన్ తో అణు ఒప్పందాన్ని రద్దుచేసుకున్న ఫలితాన్ని ప్రపంచందేశాలు అనుభవిస్తున్నాయి. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద క్రూడాయిల్ ఎగుమతిదారుగా ఉన్న ఇరాన్ పై అమెరికా ఆంక్షల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి తగ్గిపోవడంతో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయి ముడిచమురు ధరలు విపరీతంగా పెరిపోయాయి. దీనితో ప్రపంచదేశాలు అల్లాడుతున్నాయి. భారత్ లో గతంలో ఎన్నడూ లేనంత గరిష్టస్థాయికి చమురు ధరలు చేరుకున్నాయి.
దేశరాజధాని న్యూఢిలో నేడు పెట్రోల్‌ ధర 33 పైసలు పెరిగి రూ.76.24కు చేరింది. చమురు ధరలను రోజువారీగా సవరించడం మొదలుపెట్టిన తరువాత ఈ స్థాయికి పెట్రోల్ ధరలు ఎప్పుడూ చేరుకోలేదు. అదే సమయంలో డీజీల్ ధర కూడా 26 పైసలు పెరిగి రూ.67.57కు చేరింది. డీజిల్ ధర ఈస్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి.
చమురు ధరలు పెరిగిపోవడంతో దాని ప్రభారం అన్ని రంగాలపై పడుతుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగిపోయే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణలు చెప్తున్నారు. ఇరాన్ పై అమెరికా ఆంక్షల సెగ ప్రపంచానికి చాటింది. అమెరికా చర్యను ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి.
పరిస్థితి ఇంత సంక్లిష్టంగా మారడానికి కారణం అమెరికాయేనని జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ విమర్శించారు. సోచిలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన భేటీ సందర్భంగా మెర్కెల్‌ మాట్లాడారు. ఇరాన్‌ పౌర అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా తప్పుకోవటాన్ని ఆమె తప్పుబట్టారు. జర్మనీగానీ, మిగతా యూరప్‌ దేశాలుగానీ ఇరాన్‌ పౌర అణు ఒప్పందాన్ని కొనసాగించాలనే కోరుకుంటున్నాయని, భద్రతాపరంగా, నియంత్రణపరంగా, పారదర్శకతప రంగా…అన్ని విధాలుగా ఇదే అత్యుత్తమ ఒప్పందమని చెప్పారు.
బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమాన్ని ఇరాన్‌ ప్రారంభించిందనే విషయం గురించి యూరప్‌ దేశాలకు ఆందోళనలు ఉన్నాయని, అయితే ఇరాన్‌తో మాట్లా డుకోవటం ద్వారా వాటిని పరిష్కరించుకోవ చ్చునని అన్నారు. పౌర అణు ఒప్పందం నుంచి అమెరి కా తప్పుకున్న సందర్భంగా, అనేక సమస్య లపై… సందేహాలపై ముందుకెళ్లటమెలా ? అన్నదాని గురించి ఆలోచిస్తున్నామని మెర్కెల్‌ చెప్పారు.
జర్మనీ-రష్యా ఆలోచనల మధ్య ఎంతో తేడా ఉన్నప్పటికీ, అధ్యక్షుడు పుతిన్‌తో అభిప్రాయాల్ని పంచుకోవటం చాలా ప్రాధాన్యతగల భేటీ అని మెర్కెల్‌ చెప్పారు. సమస్యల్ని పరిష్కరించు కోవాలనుకుంటే, మాట్లాడుకోవాల్సిందే కదా! అని ఆమె అన్నారు. ‘ఉక్రెయిన్‌’ సంక్షోభంపై మాట్లా డుతూ…మిన్స్‌వ్క్‌ ఒప్పందం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలదని, ఉక్రెయిన్‌లో శాంతి ఏర్పడటానికి ఇదొక్కటే మార్గమని అన్నారు. ఐరాస శాంతియుత దళాల్ని మోహరించటం ముఖ్యమైన అంశమని చెప్పారు. అలాగే సిరియా అంతర్యుద్ధం గురించి చెబుతూ, ఐక్యరాజ్యసమితి చేసే ప్రతీ ప్రయత్నానికీ జర్మనీ మద్దతు ఉంటుందన్నారు. ఐరాస మధ్యవర్తిత్వంతో అక్కడ రాజ్యాంగ సంస్కరణలు తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
Petrol price, record high, diesel, Petrol price increased, seventh straight day of price increase,Indian Oil Corp (IOC), Hindustan Petroleum Corp Ltd (HPCL) and Bharat Petroleum Corp Ltd (BPCL) .

పేట్ల బురుజు ఆస్పత్రికి ఆధునిక సౌకర్యాలు


ఇద్దరు అమ్మాయిలు కలిసి చేసిన ప్రాజెక్టు. అంత మాత్రాన తీసిపారేస్తారా..!
ran