అమెరికాలో ఉంటున్న భారతీయులకు మరో చేదు వార్త

అమెరికాలో ఉంటున్న భారతీయులకు మరో చేదువార్త. హెచ్1-బీ వీసాలను ఇప్పటికే కఠినతరం చేసిన అమెరికా తాజాగా మరో ప్రతిపాదన చేస్తోంది. ఇది అమలైతే దాదాపు 70వేల మంది భారతీయులు భారత్ కు తిరిగి రావాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారతీయుల్లో చాలా మంది హెచ్-1బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కోసం అప్లై చేస్తుంటారు. ఇక నుండి గ్రీన్ కార్డ్ కు అప్లై చేసిన వారిని హెచ్-1బీ వీసాలను రెన్యువల్ చేయకూడదనే ప్రతిపాదన తీసుకుని వస్తున్నార. దీని వల్ల గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకుని వేచి చూస్తున్నవారు భారత్ కు తిరిగి వచ్చేయాల్సిందే. వారి హెచ్ 1-బి వీసాలను పునరుద్దరించడానికి వీలుండదు. ఈ కొత్త తరహా నిబంధన పట్ల చాలామంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిబంధనను అమలు చేస్తే చాలా మంది భారతీయులు వెనక్కి రావాల్సి ఉంటుందని వారు చెప్తున్నారు.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *