మరో క్షిపణి ప్రయోగానికి ఉ.కొరియా సిద్ధం…?

అమెరికా చేస్తున్న బెదిరింపులు ఉత్తర కొరియపై ఏ మాత్రం పనిచేస్తున్నట్టు లేదు. ఉత్తర కొరియా ఆటలు కట్టిస్తామంటూ ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయని ఉత్తర కొరియా తాజాగా మరో క్షిపణి పరీక్షలు సిద్ధం అవుతోంది. మధ్యంతర స్థాయి క్షిపణులను పరీక్షించేందుకు ఉత్తర కొరియా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. హవసాంగ్‌-14 ఇంటర్‌ కాంటినెంటల్‌ బాలిస్టిక్‌ క్షిపణి(ఐసీబీఎం)ని ప్రయోగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా పడమటి కోస్తా తీరాన్ని చేరుకునే సామర్థ్యం ఈ క్షిపణికి ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. అణు ప్రయోగం చేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్న ఉత్తర కొరియా మరో మారు క్షీపణి ప్రయోగానికి పూనుకుంటే సహించేదిలేదని అత్యంత కఠినంగా వ్యవహరస్తామని సైనిక చర్యకు కూడా వెనుకాడేది లేదంటూ అమెరికా చేస్తున్న హెచ్చరికలను ఉత్తర కొరియా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తన మానాన తాను క్షిపణి ప్రయోగానికి అన్నీ సిద్ధం చేసుకుంటునే ఉంది. అమెరికా -దక్షిణ కొరియా లు సంయుక్తంగా నావికా దళ వినాస్యాలు జరపనున్నాయి. ఈ సమయంలోనే ఉత్తర కొరియా తన క్షిపణిని ప్రయోగించే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *