న్యూయార్క్ లో ఉగ్రదాడి-8మంది మృతి

అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉగ్రదాడితో ఉలికి పడింది. అమెరికాలోనే అతిపెద్ద నగరం న్యూయార్క్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో 8 మంది మృతి చెందగా మరో 11 మందికి గాయాలయ్యాయి. వాహనాలనే ఆయుధాలుగా చేసుకుని ఉగ్రదాడులకు పాల్పడుతున్న ఐసిస్ ఇదే తరహా దాడితో అమెరికాలోనూ భీబత్సం సృష్టించింది. న్యూయార్క్ నగరంలో ఒక ట్రక్కు సైకిలిస్టులపైకి దూసుకుని పోవడంతో 8 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా 11 మందికి గాయాలయ్యాయి. ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అపులోకి తీసుకున్నారు. దుండగుడిని సైఫుల్లా సైపోవ్ గా పోలీసులు గుర్తించారు. 2010లో అమెరికాకు వసల వచ్చిన ఇతను ఫ్లోరిడాకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు.
అగ్రరాజ్యాన్ని వణికించిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్మారకం ఉన్న ప్రాంతంలోనే ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతానికి వచ్చిన వారిపైకి ట్రక్కు దూసుకుని పోయింది. మరణించిన వారిలో ఐదుగురు ఆర్జెంటీనా, ఒకరు బెల్జియంకు చెందిన వారున్నారు. ఈ దాడిలో గాయపడ్డవారని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ట్రక్కులో ఐసిస్ కు సంబంధించిన లేఖను పోలీసులు కనుగొన్నారు. ట్రక్కులో పారిపోయిందుకు ప్రయత్నించిన ఉగ్రవాదిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. న్యూయార్క్ నగరంలో జరిగింది ఉగ్రవాద దాడిగానే పోలీసులు చెప్తున్నారు. ఒక పథకం ప్రకారం ట్రక్కును సైకిలిస్టులపైకి దూసుకుని పోనిచ్చాడని పోలీసులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *