తాతఎన్టీఆర్,తండ్రి చంద్రబాబు లకు చెడ్డపేరు తేను:లోకేశ్

0
104

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై చేసిన ఆరోపణలపై పరోక్షంగా స్పందించారు ఏపీ ఐటి శాఖమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్. తన తండ్రి, తాత ఎన్టీఆర్ తనకు ఆదర్శమని చెప్పిన ఆయన వారిలాగా తనకు గొప్పపేరు వస్తుందో లేదో తెలియదు కానీ తనవల్ల వారకి మాత్రం చెడ్డపేరు రాకుండా చూసుకుంటానని చెప్పారు. చంద్రబాబు నాయుడి 40 సంవత్సరాల రాజకీయ జీవితంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న లోకేశ్ తన తండ్రి అహర్నిశం ప్రజలకోసం పాటుపడుతున్నారని చెప్పారు. 64 సంవత్సరాల వయసులోనూ 24 సంవత్సరాల యువకుడిలాగా ఆయన పడుతున్న కష్టాన్ని చూసి అబ్బురపడతాన్నారు. తెల్లవారు ఝామునుండి అర్థరాత్రి వరకు రాష్ట్ర సంక్షేమం కోసం ముఖ్యమంత్రి పాటుపడుతున్నారని చెప్పారు.
తన చిన్నతనం నుండీ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్న సందర్భాలు చాలతక్కువని చెప్పారు. ప్రజాజీవితంలో ఉన్న ఆయన ఎప్పుడూ ప్రజల్లోనే ఉండడానికి ఇష్టపడతారని అన్నారు. తన తండ్రితో సమానంగా తన తల్లికూడా ఎంతో కష్టపడ్డారని లోకేశ్ తెలిపారు. చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం తన తల్లి అనిచెప్పారు.ఆమె నిరంతరం చంద్రబాబు నాయుడి అవసరాలను కనిపెట్టుకుని ఉండడం వల్ల ఆయన ప్రజలకోసం కష్టపడడం సాధ్యమైందన్నారు. తనకు తన తాతా, తండ్రులే ఆదర్శమని చెప్పారు.
nara lokesh, nara lokesh babu, lokesh, nara chandrababu naidu, andhra pradesh, andhra pradesh cm.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here