నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దూసుకుని పోతోంది. ఈ ఉదయం నుండి కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో 12వ రైండ్ పూర్తయ్యేసరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి పై 21,941 అధిఖ్యంలో ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నికలపై భారీ ఆశలు పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో గెలుపొందడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ తన సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నించింది. అయినప్పటికీ ఫలితం కలిపించలేదు.