నంద్యాలలో భూమా-శిల్పా కుటుంబాల ఘర్షణ

నంద్యాల అసెంబ్లీ నియోక వర్గం ఉప ఎన్నికల సందర్భంగా భూమా, శిల్పా కుటుంబీకుల మధ్య చెలరేగిన ఘర్షణ స్థానికంగా ఉధ్రిక్తతను రేపింది. నంద్యాల ఉప ఎన్నికల ఉదయం నుండి ప్రశాంతంగా జరిగినప్పటికీ పోలింగ్ ముగుస్తుందనగా టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తొలుత నంద్యాలలోని ఏడవ వార్డులో ఇరువర్గాలు తలపడగా అటు తర్వాత అత్మకూరు బస్టాండ్ సమీపంలో భూమా, శిల్పా కుటుంబీకులే ఏకంగా ఘర్షణకు దిగడంతో ఒక్కసారిగా అక్కడ ఉధ్రిక్త నెలకొంది. అయితే అప్పటికే అక్కడ మోహరించి ఉన్న పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుండి పంపివేయడంతో పరిస్థితి కాస్త సద్దు మణిగింది. భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్, కుమారై మౌనికలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిలతో వాగ్వాదానికి దిగారు. ఇరువురు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుని ఒకరిపై ఒకరు దూషించుకోవడంతో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు తోపులాటకు దిగారు. దీనితో సమీపంలోనే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుండి పంపేశాయి. చాలా కాలంగా భూమా, శిల్ఫ కుటుంబీకల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. రెండు వర్గాలకు వీరు నాయకత్వం వహిస్తుండడంతో వీరి మధ్య ఆధిపత్యం కోసం గొడవలు మామూలే.
మరో వైపు నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6.00 వరకు జరిగిన పోలింగ్ లో దాదాపు 80శాతానికి పైగా ఓట్లు పోలైనట్టు సమాచారం. ఇరు వర్గాలు పోటాపోటీగా ప్రచారం చేయడంతో భారీ పోలింగ్ నమోదయినట్టు భావిస్తున్నారు. పోలింగ్ శాతానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *