నానక్ రాం గూడ లో భారీ పేలుడు 4గురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ లోని నానక్ రాంగూడలో భారీ పేలుడు జరిగింది. ఇందులో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. నిర్మాణంలో ఉన్న ఫొరెక్స్ భవనంలో ఈ పేలుళ్లు జరిగాయి. జిలెటిన్ స్టిక్స్ వల్లే ఈ పేలుళ్లు జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. ఘటానా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లోకి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. నిర్మాణంలో ఉన్న భవనంలో వరుసగా నాలుగు పేలుళ్లు జరిగినట్టు ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. ఈ పేలుళ్ల ధాటికి చనిపోయిన నలుగురు అక్కడ పనిచేస్తున్న కార్మికులుగా అనుమానిస్తున్నారు. గాయపడ్డ ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా మరికొందరికి కూడా గాయాలు అయినట్టు తెలుస్తోంది. పేలుళ్లు జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఒక లారీ, నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి. పేలుళ్ల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్టు స్థానికులు తెలిపారు. పేలుళ్లు జరిగిన ప్రాంతానికి సమీపంలోని పలు ఫ్లాట్ల అద్దాలు కూడా పగిలినట్టు సమాచారం.