నాగం రాకపై కాంగ్రెస్ లో మొదలైన ఆగం

0
68

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో గట్టి పట్టున్న నేత నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం అయిపోయింది. రేపో మాపో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న సమయంలో కాంగ్రెస్ లోని ఒక వర్గం ఆయన రాకను వ్యతిరేకిస్తోంది. నాగం వస్తే కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందనేది వారి వాదన. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి నాగంను తీసుకుని రావడానికి ససేమీరా అంగీకరించడం లేదు. నాగం జనార్థన్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డ ఆశీస్సులతోనే కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దామోదర్ రెడ్డి మండిపడతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ నేతల మధ్య జరిగిన సమావేశంలోనూ దామోదర్ రెడ్డి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. నాగం జనార్థన్ రెడ్డికి ప్రజల్లో ఎటువంటి పలుకుబడిలేదని కేవలం తన వాగ్ధాటి వల్ల మీడియాలో కనిపిస్తూ పెద్ద నేతగా తనను తాను ప్రచారం చేసుకుంటున్నారనేది దామోదర్ రెడ్డి వాదన. నాగం రాకవల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమీలేదని ఆయన అంటున్నారు.
మరో వైపు మా మంత్రి చిన్నా రెడ్డితో సహా పలువురు నేతలు నాగం రాకను స్వాగతిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎటువంటి నాయకులు వచ్చినా తాము అంగీకరిస్తామని వారు చెప్తున్నారు. నాగం జనార్థన్ రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ బలం ఉమ్మడి మహబూబ్ నగర్ లో మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాగంతో పాటుగా టీడీపీ నేత రావుల ను కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడాని సిద్ధంగా ఉన్నట్టు చిన్నారెడ్డి చెప్తున్నారు. అవసరం అయిన పక్షంలో తన అసెంబ్లీ సీటును సైతం ఇవ్వడానికి తాను సిద్దంగా ఉన్నానని చిన్నారెడ్డి ప్రకటించారు.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here