బుట్టో కేసులో ముషారఫ్ ను దోషిగా తేల్చిన పాక్ కోర్టు

పాకిస్థాన్ లో మరో సంచలనం నిర్ణయాన్ని అక్కడి కోర్టు వెలువరించింది. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ బుట్టో హత్య కేసులో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ను పాకిస్థాన్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ నిర్ణయం ఇప్పుడు పాకిస్థాన్ లో తీవ్ర సంచలనం రేపుతోంది. ఇటీవలే ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ ను అవినీతి కేసులో కోర్టు తప్పు పట్టడంతో ఆయన పదవి నుండి వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక మాజీ అధ్యక్షుడిని మరో మాజీ ప్రధాని హత్యకేసులో దోషిగా తేల్చడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే అరెస్టు భయంతో పాకిస్థాన్ వదిలి పెట్టి దుబాయ్ లో ప్రవాస జీవితం గడుపుతున్న ముషారఫ్ కు ఈ తీర్పుతో మాతృదేశంలో అడుగుపెట్టే ఆశలు దాదాపుగా ఆవిరైనట్టే. ప్రస్తుతం పాకిస్థాన్ లో లేనందున ముషారఫ్ కు సంబంధించిన ఆస్తులను మొత్తం స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదే కేసులో ఇద్దరు సీనియర్ అధికారులకు కోర్టు 17 సంవత్సరాలు జైలు శిక్షను విధించింది. మరో ఐదుగురిపై నమోదైన అభియోగాలను కోర్టు కొట్టి వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *