0
1

*దేశవ్యాప్తంగా స్థంభించనున్న రవాణా వ్యవస్థ
*ఒక రోజు సమ్మె చేస్తున్న ఆర్టీసీ, ఆటో, క్యాబ్ యూనియన్లు
*తెలంగాణ, ఏపీ ఆర్టీసీకి సమ్మె నోటీసులు

దేశవ్యాప్తంగా మోటారు వాహనాలు ఒక్కరోజుపాటు ఆగిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న మోటార్ వెహికల్ బిల్లు కు వ్యతిరేకంగా ఆగస్టు 7వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని మోటార వాహనాల యజమానులు, రవాణ రంగ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దీనితో దేశవ్యాప్తంగా బస్సులతో పాటుగా ఆటోలు, క్యాబ్ లలాంటి రవాణా వాహనాలు పూర్తిగా స్థంబించిపోనున్నాయి. ఈ బిల్లు అమ్మల్లోకి వస్తే దేశవ్యాప్తంగా రవాణా రంగం పూర్తిగా దెబ్బతింటుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చట్ట సవరణ ద్వారా చట్టాలు మరింత కఠినంగా మరతాయని దీని వల్ల ఆటోలు, క్యాబ్ లు నడుపుకునే వారిపై పోలీసుల జులం మరింత పెరుగుతుందని కార్మిక సంఘాలు చెప్తున్నాయి.
డీజిల్, పెట్రోల్ ధరలన జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలని కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బిల్లు వల్ల దేశవ్యాప్తంగా ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోతాయని ప్రైవేటు బస్సుల ఆధిపత్యం పెరుగుతుందని వారంటున్నారు. ఈ బిల్లు ద్వారా దేశంలోని వివిధ రూట్లను వేలం వేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దీనివల్ల లాభాలు వచ్చే రూట్లను ప్రైవేటు ట్రావెల్స్ చెజిక్కించుకుంటాయని లాభం రాని మార్గాలు మాత్రం ఆర్టీసీకి వదిలిపెడతాయని దీని వల్ల ఆర్టీసీకి మరింత నష్టం వచ్చేఅవకాశం ఉందని కార్మిక సంఘాలు అంటున్నాయి.
ప్రభుత్వ రంగ రవాణా సంఘాలకు ఉన్న ప్రత్యేక సదుపాయాలు ఇక ఉండవని దీని వల్ల ప్రైవేటు ట్రావెల్స్ కు ఆర్టీసీకి తేడా ఉండదని కార్మిక సంఘాలు చెప్తున్నాయి. దీని వల్ల లాభం లేని మార్గాల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను నడపరని ఆర్టీసీ మాత్రం నడపాల్సి వస్తుందని దీని వల్ల ఆర్టీసీకి మరిన్ని నష్టాలు తప్పవని అంటున్నారు. ఈ బిల్లు అమలైతే దేశవ్యాప్తంగా ఆర్టీసీల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కండక్టర్ల ఉద్యోగాలకు ఎసరొస్తుందని వారు వివరించారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండికి ఇప్పటికే 9 కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. దీనితో సమ్మె ప్రబావం తెలంగాణపై కూడా పడనుంది. ఆటోలు, క్యాబ్ లు పరిమిత సంఖ్యలోనే తిరిగే అవకాశాలున్నాయి.
motor vehicle, vehicle bundh,

వంటపని, ఇంటి పని చేయించడం గృహహింస కాదు:బాంబే హైకోర్టు


మానవ మృగాలపై కఠిన చర్యలకు బీజేపీ డిమాండ్

Wanna Share it with loved ones?