కన్నతల్లిని కడతేర్చిన కసాయి

కన్నతల్లిని దారుణంగా హత్యచేశాడో రాక్షసుడు. నడవలేని స్థితిలో ఉన్న కన్నతల్లిని భవనం పైకి తీసుకుని వెళ్లి అక్కడి నుండి కిందకి తోసేశాడు. ఏమీ ఎరగనట్టు తిరిగి ఇంట్లోకి వచ్చిన అతను తన తల్లి ప్రమాదవశాత్తు భవనంపై నుండి పడిపోయిందని బుకాయించాడు. అయితే నడవలేని స్థితిలో ఉన్న ఆ మహిళ భవనంపైకి ఎట్లా ఎక్కిందనే విషయాన్ని ఆరా తీయగా కోడుకు నిర్వాకం బయటపడింది. ప్రస్తుతం ఆ కిరాతకుడు ఊచకలు లెక్కపెడుతున్నాడు. ఈ దారుణ ఘటన గుజరాత్ లోని రాజ్ కోట్ ప్రాంతంలో జరిగింది.
ఓ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా ఉద్యోగం వెలగబెడుతున్న సందీప్ , అతని భార్య, తల్లి జయశ్రీలు రాజ్ కోట్ లో నివాసం ఉంటున్నారు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా సందీప్ తల్లి మంచాన పడింది. జయశ్రీ కూతురు తల్లి బాగోగులు చూసుకుంటున్నా సందీప్ ఇంట్లోనో ఉంటున్న జయశ్రీ ఆనారోగ్య విషయంలో భార్యా భర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. దీనితో తల్లిని వదిలించుకోవాలని పన్నాగం పన్నిన నీచుడు ఆమెను భవనం పైకి తీసుకుని వెళ్లి కిందకి తోసేశాడు. ఏమీ ఎరగనట్టు తిరిగి ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు. జయశ్రీ కిందపడిపోయిన సంగతి గమనించిన ఇరుగుపొరుగు వారు సందీప్ కు సమాచారం ఇస్తే ఏమీ ఎరగనట్టు తన తల్లి ప్రమాదవశాత్తు పడిపోయి ఉంటుందని అందర్నీ నమ్మించాడు.
అయితే పూర్తిగా లేవలేని స్థితిలో ఉన్న ఆమె పై అంతస్తుకు ఎట్లా వెళ్లిందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సీసీ కెమేరాలను పరిశీలించిన పోలీసులకు అసలు విజయం తెలిసింది. తల్లిని దారుణంగా హత్యచేసిన సందీప్ పై కేసుపెట్టిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.