అవిశ్వాసం వల్ల ప్రభుత్వం పడిపోతుందా..?

0
53

కేంద్రప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కొంటోంది. మొన్నటివరకు మిత్రపక్షంగా ఉన్న తెలుగగుదేశం పార్టీ, మిత్రపక్షంగా లేకున్నా బీజేపీకి అన్నిరకాలుగా సహాయసహకారాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం విశేషం. బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న పక్షాలు అవిశ్వాసానికి మద్దతు ప్రకటించాయి. బీజేపీ వ్యతిరేక పార్టీలను కూడగట్టగడంలో కాంగ్రెస్ క్రియాశీల పాత్రను పోషిస్తోంది.
అవిశ్వాస తీర్మానం వల్ల బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీలేదు. ప్రభుత్వం పడిపోతుందనే అనుమానాలు ఏ కోశానా లేవు. మెజార్టీకి అవసరం అయిన 271 సభ్యుల్లో బీజేపీ సొంత బలమే 274 గా ఉంది. దీనికి తోడు మిత్రపక్షాల అండ ఉండనే ఉంది. మిత్ర పక్షాలతో కలుపుకుని బీజేపీ బలం 311. ఇటీవల కాలంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న మరో మిత్రపక్షం శివసేన కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికినా బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఆ పార్టీ బలం లోక్ సభలో 18 వారిని మినహాయించుకున్నా బీజేపీ బలం 293గా ఉంది. అంటే కనీస మెజార్టీ కంటే చాలా ఎక్కువ.
తటస్థపార్టీల్లో అన్నాడీఎంకే తన మద్దతు ప్రభుత్వానికే అని స్పష్టంగా ప్రకటించింది. బీజు జనతాదళ్ తన వైఖరిని చెప్పలేదు. టీఆర్ఎస్ కూాడా తన వైఖరిని స్పష్టం చేయలేదు. వీరంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేసినా ప్రభుత్వానికి ఎటువంటి ఢోకాలేదు. ఇప్పటివరకు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉన్న పార్టీల సభ్యుల సంక్ష 151 గా ఉంది.
telugudesam, telugudesam party, tdp, ysrcp, andhra pradesh, no confidence motion.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here