మోడీ విజయ చిద్విలాసం

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో బీజేపీ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ఆనందం వ్యక్తం చేశారు. పార్లమెంటు కు హాజరయ్యే సందర్భంలో మోడీ విలేకరులకు విజయచిహ్నం చూపించారు. రెండు రాష్ట్రాల్లోనూ తమ పార్టేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. గుజరాత్, హిమాచల్ లలో తమ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుని వెళ్తోందని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తుండడం పట్ల రాజ్ నాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల ఆశలకు అనుగుణంగా నడుచుకుంటామని అన్నారు.