సెల్ ఫోన్ కోసం స్నేహితుడి దారుణ హత్య

సెల్ ఫోన్ కోసం స్నేహితుడిని హతమార్చిన దారుణ ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఖరీదైన సెల్ ఫోన్ ను తన సొంతం చేసుకునేందుకు ఇంటర్ చదువుతున్న విద్యార్థిని అతని స్నేహితుడే దారుణంగా హత్యచేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఖరీదైన సెల్ ఫోన్ లను వాడడం ప్రతిష్టాగా భావిస్తున్న యువత దానికోసం ఎంతకైనా తెగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం… ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ప్రేమ్ కుమార్ రామాంతపూర్ లోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 13న అతను కనిపించడంలేదంటూ విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుబోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఖరీదైన ఫోన్ ను కొనుక్కున్న ప్రేమ్ కుమార్ తన స్నేహితులకి దాన్ని చూపించాడు. వారిలో సాగర్ అనే యువకుడి కన్ను సదరు ఫోన్ పై పడింది. దాన్ని ఎట్లా అయినా సాధించాలనే దురుద్దేశంతో హతుడిని లాంగ్ డ్రైవ్ కు వెళ్దామని పిల్చాడు. ఆదిబట్ల వద్ద ప్రేమ్ కుమార్ ను హత్య చేసి ఘట్ కేసర్ వద్ద కొనుగోలు చేసిన పెట్రోల్ తో ప్రేమ్ కుమార్ మృతదేహాన్ని కాల్చేశాడు.
విద్యార్థి అదృశ్యం అయినట్టు ఫిర్యాదు అందుకున్న తరువాత దీనిపై విచారణ చేపట్టగా హతుడు నిందితుడి సాగర్ తో పాటుగా వెళ్లినట్టుగా తమకు తెలిసిందని సాగర్ కదలికలపై నిఘా పెట్టి అతన్ని అదుపులోకి తీసుకోవడంతో తానే హత్యచేసినట్టుగా అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ప్రేమ్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. హతుడి తల్లిదండ్రులు నాటకాలు వేస్తూ ఖాళీ సమయాల్లో దర్జీ పనులు చేస్తుంటారని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు పైసా పైసా కూడబెట్టి కొనిచ్చిన సెల్ ఫోన్ ఆఖరికి అతని ప్రాణాలే తీసింది.
uppal. uppal police station, uppal murder, murder, cell phone, student murder for cell phone.

వీహెచ్ పై మండిపడుతున్న అంజన్ కుమార్ యాదవ్


అబద్దపు ప్రచారాలు చేస్తే జైలుకేనా…?