టీటీడీ బోర్డు నుండి తప్పుకున్న ఎమ్మెల్యే అనిత

హింధూ సంఘాల నుండి, ప్రజల నుండి తీవ్ర ఒత్తిడి రావడంతో టీటీడీ బోర్డు సభ్యురాలిగా పదవీ బాధ్యతలను ఎమ్మెల్యే అనిత స్వీకరించడం లేదు. ఈ మేరకు ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖరాశారు. తిరుమల తిరుపతి బోర్డు సభ్యురాలిగా అనితను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన తరువాత దీనిపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆమె క్రైస్తవురాలని, ఆమెను హింధువుల పుణ్యక్షేత్రం తిరుమల బోర్డు సభ్యురాలిగా నియమించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనితో తాను పదవిని చేపట్టడంలేదని అనిత పేర్కొన్నారు.
తనను టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఎంపికచేయడం ఆనందం కలిగించిందని హింధువుగా తనకు ఇది దక్కిన గౌరవంగా ఆమె తన లేఖలో పేర్కొన్నారు. అయితే కొంతమంది తనపై దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని అనిత ఆరోపించారు. తాను శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తురాలినని గతంలో అనేకసార్లు తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నట్టు ఆమె తన లేఖలో పేర్కొన్నారు.
తనపై వస్తున్న ఆరోపణలు భాదించాయని ఈ కారణంగా ప్రభుత్వం ఇబ్బందులు పడకూదనే ఉద్దేశంతోనే తాను బోర్డు సబ్యురాలిగా బాధ్యతలను స్వీకరించదల్చుకోలేదని అనిత స్పష్టం చేశారు. షేడ్యుల్డ్ కులాలకు చెందిన మహిళగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో తనకు చోటు కల్పించడం తనకు ఆనందం కలిగించినా పరిస్థితుల వల్ల ఆ పదవిని స్వీకరించడం లేదన్నారు.
హింధువులంటే అంత చులకనా…?
Tirumala_Tirupati_Devasthanams