మహిళలకు పెద్దపీట వేస్తున్నాం: మంత్రి లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత మహిళలు తలఎత్తుకుని జీవించేలా ప్రభుత్వం పథకాలకు రూపకల్పన చేసిందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం బాదేప‌ల్లి ప‌ట్ట‌ణం శాంతి న‌గ‌ర్‌లో రూ.10ల‌క్ష‌ల‌తో నిర్మించిన మ‌హిళాసంఘ భ‌వ‌నాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు కేసీఆర్ ప్రభుత్వం పెద్ద పీటవేస్తోందన్నారు.
మహిళలు ఎవరిపైనా ఆధాకపడకుండా వారి కాళ్లపై వారు నిలబడే విధంగా కేసీఆర్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు. విద్యా, ఉపాధి అవకాశాల్లో మహిళలు ప్రధాన్యం ఇస్తున్నట్టు ఆయన వివరించారు. ఆర్థికంగా మహిళలను ఆదుకోవడంతో పాటుగా వ్యాపారం, సొంత ఉపాధికోసం మహిళలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు.
వితంతువులకు పెన్షన్లు ఇవ్వడం ద్వారా వారు సమాజంలో గౌరవంగా బతికే విధంగా చూస్తున్నామని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్నారని, ఇందులో మహిళ సాధికారితకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. మహిళలు ఆర్థికంగా బలంగా ఉంటే కుటుంబం మొత్తం ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతుందని ఆవిధంగా ఆలోచించే ముఖ్యమంత్రి మహిళలకు చోదుడువాదోగు ఉంటున్నారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళపై జరుగుతున్న దాడులు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గాయని మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు. షీటీమ్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారి భరతం పడుతున్నారని అన్నారు.
కెసిఆర్ కిట్ల ప‌థ‌కం ఆరోగ్య స‌మాజ నిర్మాణానికి ఉప‌యోగ‌ప‌డుతున్న‌ద‌న్నారు. గ‌ర్భందాల్చిన నాటినుంచి ఆరోగ్య ల‌క్ష్మీ ప‌థ‌కం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామ‌న్నారు. ఉచితంగా ప‌రీక్ష‌లు చేయించి, ప్ర‌స‌వం, ప్ర‌స‌వానంత‌రం బిడ్డకు 9 నెల‌లు దాటే వ‌ర‌కు ఆత‌ర్వాత కూడా అనేక విధాలుగా ప్ర‌భుత్వ‌మే త‌ల్లీ, బిడ్డ‌ల బాగోగులు చూసుకుంటున్న‌ద‌న్నారు. మ‌గ బిడ్డ పుడితే రూ.12వేలు, ఆడ‌బిడ్డ పుడితే అద‌నంగా వెయ్యి రూపాయ‌లు క‌లిపి రూ.13వేలు ఇస్తున్న విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు. అలాగే జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలోనూ మ‌హిళ‌ల‌కు ఇస్తున్న అవ‌కాశాలు, ల‌భిస్తున్న స‌బ్సిడీలు, అభివృద్ధి సంక్షేమాల‌ను ఈ సంద‌ర్భంగా మంత్రి వివ‌రించారు.
minister lakshma reddy, lakshma reddy, health minister, telangana health minister,women, women empowerment.
womens
kcr kit