జులైనాటికి ఎల్బీనగర్ -అమీర్ పేట మార్గంలోనూ మెట్రో రైలు పరుగులు

ప్రస్తుతం నాగోల్-మియాపూర్ మార్గాల్లో మెట్రో రైలు నడుస్తున్నప్పటికీ ట్రాఫిక్ చిక్కుల్లో ఎటువంటి మార్పులు కనిపించడం లేదు. ఎల్బీనగర్ – అమీర్ పేట మార్గం పూర్తయితే తప్ప ట్రాఫిక్ సమస్యకు కొంతవరకు చెక్ పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధానమైన ఈ మార్గంలో మెట్రోరైలును ప్రారంభిస్తే నగర ప్రజలు ట్రాఫిక్ సమస్యల నుండి బయటపడే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.
నాగోల్ – మియాపూర్ మార్గాన్ని ప్రారంభించిన మెట్రోరైలు అధికారులు జులై నాటికల్లా ఎల్బీనగర్-అమీర్ పేట మార్గాల్లోనూ రైలును నడిపేందుకు ఏర్పాట్లను పూర్తిచేస్తున్నారు. ఈ మేరకు శరవేగంగా పనులు పూర్తవుతున్నాయి. జులై నాటికల్లా ఈ మార్గంలో మెట్రో రైలు పరుగులు తీస్తుందని మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ప్రకటించగా తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అదే విషయాన్ని పునరుద్భాటించారు. మెట్రోరైలు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని జులై కల్లా ఈ మార్గంలో మెట్రోరైలు పరుగులు పెడతాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని రోజుల ట్రయల్ రన్ తరువాత మెట్రోసేవలు ఈ మార్గంలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
రింగ్ రోడ్ తరహాలో హైదరాబాద్ చుట్టుతా మెట్రో రైలు మార్గాలను తీసుకుని వస్తున్నట్టు ఆయన వివరించారు. దీని వల్ల నగర ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తక్కుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మెట్రో రైళ్లలోనూ కొన్ని ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్టు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక భోగీలను ఏర్పాటు చేశామని త్వరలోనే మరిన్ని సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.
హైదరాబాద్ నగర ప్రజలు ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. ఇంటి నుండి బయట కాలు పెట్టిన తరువాత ఎప్పుడు తిరిగి వస్తామో, ఎట్లా తిరిగి వస్తామో తెలియని పరిస్థితి. సాదారాణ రోజుల్లోనే ట్రాఫిక్ లో నగరం కనిపిస్తుంది. ఇక వర్షం పడినపుడో ఇతరత్రా ఇబ్బందులు తలెత్తినపుడే చెప్పాల్సిన అవసరమే లేదు. మెట్రో రైలు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాల నుండి బయటపడవచ్చని నగర జీవి ఆశపడుతున్నాడు.
metro rail, hyderabad metro, hyderabad metro rail, metro rail project, hyderabad metro rail project, metro rail between lbnagar -ameerpet, metro rail route, metro rail project.

ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్న కేంద్రం : మన్మోహన్ సింగ్


kaleshwaram
Hyderabad_Metro