మెట్రోలో తొలిరోజు…

భాగ్యనగరంలో మొదలైన మెట్రో ట్రైన్ లో నగర వాసులు మస్త్ గా ఎంజాయ్ చేశారు. మెట్రోలో తొలిరోజునే ప్రయాణించేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు స్టేషన్ల వద్ద బారులు తీరారు.ఉదయం నుండి స్టేషన్ల వద్ద రద్దీ కనిపించింది. సాయంత్రానికి రద్దీ మరింత పెరిగింది. మెట్రోలో ప్రయాణం ఆహ్లదకరంగా అనిపించిందని హైదరాబాద్ కు మెట్రో వచ్చిన తొలిరోజునే అందులో ప్రయాణించడం ఆనందంగా ఉందని సాయి కృష్ణ అనే ప్రయాణికుడు చెప్పాడు. మెట్రో లో ప్రయాణిస్తూ నగరంలోని వివిధ ప్రాంతాలను చూడడం కొత్తగా ఉందని రోజూ ప్రయాణించే రోడ్లను ఎత్తునుండి చూడడం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. చాలా కాలం పాటు ఎదురు చూసిన మెట్రోలో ప్రయామించడం సరదాగా ఉందని రాజు అనే మరో ప్రయాణికుడు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. మెట్రోలో ఎక్కడాని తాను దిల్ షుఖ్ నగర్ ప్రాంతం నుండి నాగోల్ కు వచ్చినట్టు ఆయన చెప్పారు. మెట్రో ఎల్బీనగర్ రూట్ ను కూడా త్వరగా ప్రారంభించాలని ఆయన కోరాడు. రైల్వే ష్టేషన్లతో పాటుగా రైళ్లలో కూడా భద్రతా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నయని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మెట్రోరైలు క్షణాల్లో పికప్ అందుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. రానున్న మెట్రో స్టేషన్ కు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే ఇవ్వడం వల్ల దిగాల్సిన వారు అప్రమత్తం అవుతున్నారు.
ప్రారంభించిన తొలిరోజునే పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తరలిరావడంతో మెట్రో సిబ్బంది కొద్దిగా ఇబ్బందులు పడ్డారు. టికెట్లు ఇవ్వడం, స్టేషన్లలోకి అనుతించడం లలో కొద్ది పాటు ఇబ్బందులు తప్పలేదు. ప్రయాణికులకు సరైన అవగాహన లేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రయాణికులకు సరైన సమాచారం కూడా కొన్ని చోట్ల అందుబాటులో లేకుండా పోయింది. అయితే ఇవన్నీ చిన్నచిన్న సమస్యలని అన్నీ ఒకటి రెండు రోజుల్లోనే సర్థుకుంటాయని మెట్రో సిబ్బంది చెప్తున్నారు.
మెట్రో ష్టేషన్లలో సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం మాత్రం ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది. చాలా స్టేషన్లలో వాహనాల పార్కింగ్ కు ఏమాత్రం అవకాశం లేకుండా ఉంది. దీనితో చాలా మంది తమ వాహనాలను రోడ్లపైనే పెట్టడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఉప్పల్ స్టేషన్ వద్ద వాహనాలను రోడ్లపైనే ఉంచడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. మెట్రో అధికారులు పార్కింగ్ విషయంలో మరింత శ్రద్ద చూపించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *