భార్యా పిల్లలను చంపిన రాక్షసుడు

0
49

కుటుంబ కలహాలతో భార్యతో పాటుగా ఇద్దరు బిడ్డలను దారుణంగా హత్యచేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జిల్లెలగూడలోని సుమిత్ర ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్న హరిందర్ గౌడ్ కు భార్య, ఆరేళ్ల కొడుకు, నాలుగు సంవత్సరాల కూతురు ఉన్నారు. గతంలో డెంటల్ ల్యాబ్ ను నిర్వహించిన హరిందర్ గౌడ్ కొద్దికాలంగా ఖాళీగా ఉంటున్నాడు. దీనిపై భార్యతో గొడవలు జరుగుతుండేవి. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి కూడా భార్యా భర్తల మధ్య గొడవలు జరిగినట్టు తెలుస్తోంది.
భార్యతో గొడవతో హరిందర్ రాక్షసుడిగా మారాడు. భార్యను గొంతు నులిమి హత్య చేసిన తరువార కొడుకు అభిజిన్ (6), కూతురు సహస్ర (4) లను కూడా దారుణంగా హత్యచేశాడు. ముగ్గురిని హత్యచేసిన తరువాత నిందితుడు మీర్ పేట పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తన భార్యా పిల్లలను హత్యచేసినట్టు నిందితుడు పోలీసులు చెప్పాడు. నిందితుడు హరీందర్ ది రంగారెడ్డి జిల్లా కులకచర్లగా పోలీసులు తెలిపారు.
ఇద్దరు కన్న బిడ్డలతో పాటుగా భార్యను దారుణంగా హత్యచేసిన హరిందర్ ను పోలీసులు అదుపులోకితీసుకుని విచారిస్తున్నారు. హత్యలకు కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. ఇద్దరు చిన్నారులతో పాటుగా వారి తల్లి హత్యకు గురికావడం స్థానికంగా సంచలనంగా మారింది.Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here