విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్

0
52

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి గాను విపక్షాలు మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ను ఎంపిక చేశాయి. ఈ రోజు సమావేశమైన కాంగ్రెస్, వామపక్షాలతో పాటుగా ఇతర విపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా మీరా కుమార్ ను ఎంపిక చేశాయి. మొట్టమొదటి మహిళా స్పీకర్ గా పనిచేసిన మీరా కుమార్ ప్రముఖ దళిత నేత బాబు జగ్జీవన్ రాం కుమారై. ఢిల్లీలో ఎం.ఎ., ఎల్.ఎల్.ఎం చదివిన విద్యావంతురాలు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ కు ఎంపికైన మీరా కుమార్ భారత్ తరుపున అనేక దేశాల్లో పనిచేశారు.  1985లో మీరా కుమార్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బిజ్నోర్ నుండి లోక్ సభకు మీరా కుమార్ ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ ఆమె రాంవిలాస్ పాశ్వాన్, మాయవతి లాంటి నేతలను ఓడించారు. 2004, 2009 ఎన్నికల్లో మీరాకుమార్ దివంగత జగ్జీవన్ రాం ప్రాతినిధ్యం వహించిన ససారం నుండి పోటీ చేసి గెల్చారు. 2004 నుండి 2009 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాంఘీక సంక్షేమ శాఖను నిర్వహించిన మీరా కుమార్ అటు తర్వాత లోక్ సభ స్పీకర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఎన్డీఏ తన అభ్యర్థిగా దళిత వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ ను ఎంపిక చేయడంతో విపక్షాలు కూడా దళిత వర్గానికి చెందిన మీరా కుమార్ ను తెరపైకి తెచ్చాయి.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here