తెలంగాణలో మెడికల్ సీట్లు పెరిగాయి. దీనితో వందల మంది వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారికి ఊరటనిచ్చింది. సిద్దిపేటలో 150 సీట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఎంసీఐ అనుమతి ఇచ్చింది. దీనితో పాటుగా మహబూబ్ నగర్ లో 3వ బ్యాచ్ కి గాను 150 సీట్లను ఎంసీఐ రెన్యువల్ చేసింది. నిజామాబాద్ మెడికల్ కాలేజీ లో 100 సీట్లను పునరుద్దరిస్తూ ఎంసీఐ నిర్ణయం తీసుకుంది.
మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అదనపు మెడికల్ సీట్లు అందుబాటులోకి రావడం తో వైద్య విద్యను అభ్యసించాలనుకునేవారి సీట్ల సంఖ్య పెరిగినట్టయింది. వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో 2018-19 ఏడాదికి 150 సీట్లతో సిద్దిపేట మెడికల్ కాలేజీ స్థాపనకు ఐఎంసీ చట్టం ప్రకారం 10ఏ, 1956 చట్టం ప్రకారం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిఫారసు చేసింది. దీనితో కేంద్ర ప్రభుత్వ అనుమతి ఇక లాంఛనం మాత్రమే. కాగా, 2018-19 ఏడాదికి మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో 3 వ బ్యాచ్ 150 సీట్లకు రెన్యూవల్ వచ్చింది. ఇదిలా ఉండగా నిజామాబాద్ మెడికల్ కాలేజి 100 సీట్ల రెన్యూవల్ కి కూడా అనుమతి లభించింది.
తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు రావడానికి అవసరమైన దిశా నిర్దేశం చేసిన సీఎం కేసీఆర్ కి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మెడికల్ కాలేజీ అనుమతులు రావడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో సీఎం సహకారం అమరవలేనిదన్నారు. సిద్దిపేట మెడికల్ కాలేజీ స్థాపనలో అవసరమైన భూ సేకరణ, ఇతర వసతుల విషయంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరిశ్ రావు చొరవ కూడా కీలకం అన్నారు. అనుమతులు ఇవ్వడానికి సహకరించిన ఎంసీఐ కి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే తరహాలో సీఎం కేసీఆర్ తలపెట్టిన సూర్యాపేట నల్గొండ మెడికల్ కాలేజీలని సాధిస్తామని మంత్రి భరోసా వ్యక్తం చేశారు.
medical seats, telangana, medical seats in telangana, telangana medical seats, medical seats , medical council of india.