మేడారంలో తీవ్ర ఉధ్రిక్తత/ telangana headlines

telangana headlines ఆదివాసీలకు లంబాడీలకు మధ్య రోజురోజుకూ అగాధం పెరుగుతున్నట్టుగానే కనిపిస్తోంది. తాజాగా మేడారంలో ఈ వ్యవహారం తీవ్ర ఉధ్రిక్తతకు దారితీసింది. ప్రఖ్యాత సమ్మక్క-సారలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారకార్యక్రమం రణరంగంగా మారింది. బోర్డులో ఉన్న ముగ్గురు లంబాడీ సభ్యులను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీనితో వారిని పోలీసులు అక్కడి నుండి పంపేయడంతో ఆగ్రహం చెందిన ఆదీవాసీలు ప్రమాణ స్వీకారానికి వచ్చిన వారి కార్లను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ కారుతో సహా పదికార్లు ధ్వంసం అయ్యాయి. ఆగ్రహంతో ఉన్న ఆదీవాసీలు ఐటిడీఏ కార్యాలయానికి కూడా నిప్పుపెట్టారు.
ఎస్టీ రిజర్వేషన్లలో అధికశాతం లంబాడీలే తన్నుకుని పోతున్నారని ఆదీవాసీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు వర్గాలకు మధ్య పలు చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. తాజా ఘటనతో మేడారంలో తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది.

telangana headlines