భారీ ఎన్ కౌంటర్ 14 మంది మావోయిస్టులు మృతి

మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ… ఛత్తీస్ ఘఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో 14 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది. వీరిలో మహిళా మావోలు కుడా ఉన్నట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. చత్తీస్ ఘడ్ సుక్మాజిల్లాలోని గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. మావోలకు గట్టి పట్టున్న సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ తో పాటుగా ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి గాలింపు చేపడుతుండగా వారికి మావోలు తారసపడినట్టు పోలీసులు వర్గాలు చెప్తున్నారు. మావోయిలు పోలీసులపై కాల్పలకు దిగారని రెండు వైపులా భారీ ఎత్తున కాల్పులు చోటుసుకున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.
అటవీ ప్రాంతంలో దాదాపు 200 మంది మావోయిస్టులు సమావేశం అయినట్టుగా అందిన సమాచారం మేరకు ఆ ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన గాలింపులో మావోలు తారసపడడంతో ఎదురుకాల్పుల ఘటచోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
కాల్పులు పూర్తయిన తరువాత పరిశీలించగా 14 మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టమైన సమాచారం ఏదీ తెలియడంలేదు. ఎన్ కౌంటర్ జరిగినట్టుగా సుక్మా జిల్లా ఎస్పీ ధృవీకరించినప్పటికీ మృతులకు సంబంధించిన వివరాలను పూర్తిగా వెల్లడించలేదు. ఆ ప్రాంతంలో ఇంకా ఎదురు కాల్పులు జరుగుతున్నాయని అవి పూర్తయిన తరువాతనే స్పష్టమైన సమాచారం ఇస్తామని చెప్పారు.
encounter, maoist, sukma district.

A farmer's dream


కాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్ 5గురు ఉగ్రవాదల హతం