ఆయుర్వేద వైద్యులు మాణిక్యశర్మకు జీవన సాఫల్య పుస్కారం

0
67

ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, పరిశోధకులు డాక్టర్ శాస్త్రుల మాణిక్య శర్మ జీవిత సాఫల్య బహుమతిని అందుకున్నారు. ఎర్రగడ్డలోని డాక్టర్ బీఆర్ కేఆర్ ప్రభుత్వ వైద్యకళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయను ఈ అవార్డును బహూకరించారు. ఆయుర్వేద వైద్యుడిగా అనేక పరిశోధనలు చేసిన మాణిక్యశర్మ అనేక మందిని వైద్యులుగా తీర్చిదిద్దారు. ఆయుర్వేదంలో కాయ చికిత్సలో ఆయన చేసిన పరిశోధనలు ప్రఖ్యాతి గాంచాయి. ఆయుర్వేదంలో ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా నిర్వాహాకులు అభినందించారు. ఆయుర్వేదాన్ని జనబాహుళ్యానికి దగ్గర చేయడంతో పాటుగా భావితరాలకు పనికి వచ్చే ఎన్నో పరశోధనలకు ఆయన ప్రాణం పోశారని కొనియాడారు.
ఈ సందర్భంగా మాణిక్య శర్మ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం ఇంకా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ వైద్య విజ్ఞానం ప్రపంచానికే తలమానికం వంటిదన్నారు. పురాతన వైద్యానికి ఆధునికతను జోడిస్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయన్నారు.Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here