టీవీ యాంకర్ మల్లిక మృతి

ప్రముఖ తెలుగు టీవీ యాంకర్, నటి మల్లిక(40) బెంగళూరులో కన్నుమూశారు. హూషారైన వ్యాఖ్యలతో మంచి యాంకర్ గా పేరు సంపాదించుకున్న మల్లిక టీవీల్లో అనేక కార్యక్రమాలను నిర్వహించారు. యాంకర్ గా మంచి పేరు సంపాదించుకున్న తరువాత నటిగా మారిన ఆమె అనేక తెలుగు చలన చిత్రాల్లో నటించారు. చాలా సినిమాల్లో కనిపించిన ఆమె పెళ్లి తరువాత నటనకు,టీవీ రంగానికి దూరం అయ్యారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న మల్లిక 20 రోజులుగా కోమాలోనే ఉన్నట్టు సమాచారం. మల్లిక బౌతిక కాయాన్ని హైదరాబాద్ కు తీసుకుని వస్తున్నారు. పలువురు టీవీ యాంకర్లు, నటీ నటులు, సినీ నటులు మల్లిక మరణంపై సంతాపం వెలిబిచ్చారు. టీవీల్లో మల్లికగా పేరుగాంచిన ఆమె అసలు పేరు అభినవ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *