మల్కాజ్ గిరి రాంచంద్రరావు సొంతమవుతుందా?

0
100
ramchander rao mlc

Malkajgiri Assembly … మల్కాజ్ గిరి అసెంబ్లీ స్థానంలో పాగా వేసేందుకు ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు పావులు కదుపుతున్నారు. దీనికోసం గాను ఇప్పటినుండే ఆయన కార్యాచరణ మొదలుపెట్టారు. నియోజకవర్గ పరిధిలో బస్తీల్లో పర్యటిసతున్న ఆయన ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసిన ఆయన స్వల్ప తోడాతో ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్ తరపున పోటీచేసిన కనకారెడ్డి చేతిలో కేవలం 2786 ఓట్ల తేడాతో రాంచంద్రరావు ఓటమిపాలయ్యారు. దీనితో తిరిగి ఇక్కడ ఎలాగైనా పాగావేయాలని ఆయన ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ తిరిగి ఎమ్మెల్యేగా పోటీచేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఈ మేరకు పార్టీ పెద్దల నుండి ఆయనకు భరోసాకూడా వచ్చినట్టు వారు పేర్కొంటున్నారు. పార్టీ అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో పాటుగా గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోవడంతో ఈసారి ఎలాగైనా మల్కాజ్ గిరి స్థానాన్ని కైవసం చేసుకోవడానికి రాంచద్రరావు కసరత్తులు చేస్తున్నారు.
విద్యావంతుల కుటుంబం నుండి వచ్చిన రాంచంద్రరావు న్యాయవాదిగా మంచిపేరు సంపాదించుకున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడైన ఆయన బీజేపీలో పలు కీలక పదవులు నిర్వహిస్తున్నారు. మంచి వాగ్ధాటి ఉన్న నేతగా రాంచంద్రరావుకు పేరుంది. ఎట్టిపరిస్థితుల్లో మల్కాగ్ గిరి నియోజకవర్గం నుండి ఎన్నికవ్వాలనే పట్టుదలతో ఇప్పటినుండి అందుకు తగినట్టుగా నియోజవర్గంలో డివిజన్ల వారీగా పర్యటనలు సాగించడంతో పాటుగా స్థానిక నేతలతో తరచూ సమావేశమవుతున్నారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న సామాజికవర్గానికి చెందిన ఈయన సామాజిక వర్గం ద్వారా ఓట్లను అడిగేందుకు ఇష్టపడడంలేదని అన్ని వర్గాల ఆదరణను పొందడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని రాంచంద్రరావు సన్నిహితులు చెప్తున్నారు. అయితే పలువురు సామాజిక వర్గనేతలు కూడా ఆయనకు అండగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న సదరు సామాజికవర్గం ఓటర్లను ఒక్కతాటిపైకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. సంప్రదాయ బీజేపీ ఓటు బ్యాంకుతో పాటుగా తమ సామాజిక వర్గం ఓట్లు కూడా గంపగుత్తగా పడితే రాంచంద్రరావు విజయం నల్లేరుమీద బండినడకేనని వారు చెప్తున్నారు.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. నియోజకవర్గంలోని టీడీపీ అభిమానులు రాంచంద్రరావుకు గట్టి మద్దతు ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. బీజేపీ-టీడీపీల బంధం తెగిపోవడంతో ఇప్పుడు ఒంటరిపోరు తప్పదని తేలిపోయింది. ఈ క్రమంలో గత ఎన్నికల కంటే మరింత ఎక్కువ ప్రజల్లోకి పోవాల్సన అవసరాన్ని గ్రహించిన ఆయన ఆ దిశగా తన వ్యూహాలకు పదునుపెడుతున్నట్టు తెలుస్తోంది. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఆంధ్రాప్రాంతం నుండి వలస వచ్చిన వారున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు బీజేపీపై కొంత ఆగ్రహంతో ఉన్నారనేది కాదనలేని వాస్తవం. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ తమను మోసంచేసిందనే భావన గట్టిగానే ఉంది. దీన్ని తట్టుకుని ముందుకు పోయేందుకు రాంచంద్రరావు ఏ చేస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది.
ఏది ఏమైనా ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే ఎన్నికల వ్యూహాలతో ముందుకు పోతున్న రాంచంద్రరావు గెలుపు ఖాయమని ఆయన అభిమానులు, అనుచరులు బల్లగుద్ది చెప్తున్నారు.
Naraparaju Ramchander Rao , Ramchander Rao , bjp, bjp ramchander rao, Malkajgiri, malkajgiri assembly, malkajgiri assembly seat, malkajgiri assembly constituency, brahmin voters, brahmin, malkajgiri brahmins.

సినిమా హాళ్లపై కొనసాగుతున్న దాడులు


ప‌క‌డ్బంధీగా పంచాయతీరాజ్ చట్టం అమలు
Malkajgiri

Wanna Share it with loved ones?