అవిశ్వాసం పై చర్చ జరక్కుండానే లోక్ సభ వాయిదా

0
72

కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరక్కుండానే లోక్ సభ మంళవారానికి వాయిదా పడింది. సభ ప్రారంభమైన తరువాత రెండు పార్టీలు ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఇచ్చిన తీర్మానాన్నిస్వీకరిస్తున్నట్టు స్పీకర్ సుమిత్ర మాహాజన్ ప్రకటించారు. దీనిపై చర్చకు ఆమె పార్టీలను ఆహ్వానించినప్పటికీ వివిధ అంశాలకు సంబంధించి సభ్యులు సభలో ఆందోళన చేస్తుండడంతో సభ సజావుగా లేకపోవడంతో తీర్మానంపై చర్చ జరక్కుండానే సభ మంగళవారానికి వాయిదా పడింది.
లోక్ సభ ప్రారంభమయిన వెంటనే రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్ సభ్యులు, కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే సభ్యులు సభలో ఆందోళన జరిపారు. వీరంతా వెల్ లోకి దూసుకుని వచ్చి సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. అన్ని విషయాల గురించి చర్చిద్దామంటూ హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ చేసిన విజ్ఞప్తిని కూడా సభ్యులు పట్టించుకోలేదు. అవిశ్వాస తీర్మానంపై చర్చజరపాలని, సభ్యులు ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. తాము ప్రస్తావించిన అంశాలపై వెంటనే చర్చ జరగాలని, ప్రభుత్వం దిగిరావాలంటూ టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
telangana, telangana mps, lok sabha telangana mps, no confidence motion by tdp, no confidence motion by trs, telugu desam party, tdp, trs, ysrcp, sumitra mahajan.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here