లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

0
53

చలికి అల్లాడుతున్న నీడలేని ప్రజలకు అండగా నిల్చింది లయన్స్ క్లబ్… నగరంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిన నేపధ్యంలో చలికి అల్లాడుతున్న అభాగ్యులకు ఆసరాగా నిల్చిన ఉప్పల్ లయన్స్ క్లబ్ పేదలకు దుప్పట్లను పంచిపెట్టింది. ఉప్పల్ స్వరూప్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం వద్ద ఉన్న పేదలకు, బిచ్చగాళ్లకు దాదాపు 50 దుప్పట్లను లయన్స్ క్లబ్ ప్రతినిధులు పంచిపెట్టారు.
lion2 lion
నిలువనీడ లేకుండా చలికి ఇబ్బందులు పడుతున్న వారిని అదుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు లయన్స్ క్లబ్ ప్రతినిధులు చెప్పారు. స్వరూప్ నగర్ తో పాటుగా ఉప్పల్ లోని పలు చోట్ల దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వారు వెల్లడించారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు సుధీర్ రెడ్డి, రఘుపతి రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here