విద్యార్థులకు ఎల్.ఐ.సీ ఉద్యోగుల చేయూత

సుల్తాన్ షాహీ లోని ప్రభుత్వ జీబీజీఎస్ పాఠశాలలో విద్యార్థులకు ఎల్.ఐ.సీ ఉద్యోగులు పుస్తకాలు, పెన్సీళ్లు,పెన్నులతో పాటుగా వాటర్ బాటిళ్లు, బ్యాగులు పంపిణీచేశారు. ఎల్.ఐ.సీ ఉద్యోగులకు చెందిన “హెల్పింగ్ హ్యాండ్స్” ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్.ఐ.సీకి చెందిన ఉద్యోగులు తమ వేతనంలో కొంత మొత్తాన్ని సామాజిక సేవ కోసం కేటాయిస్తున్నారు. దీని నుండి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు సంస్థ ఉద్యోగులు తెలిపారు. సామాజిక మాధ్యతలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాల వాటింకి ఇబ్బందిగా ఉందని ఈ విషయం తమ దృష్టికి వచ్చిన తరువాత వారిని ఆదుకునేందుకు నడుంబిగించినట్టు చెప్పారు. ఈ కార్యకర్మంలో ఎల్.ఐ.సీ ఉద్యోగులతో పాటుగా పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రభుత్వం తరపున పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందుతున్నా పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ముందుకు వచ్చి వారికి సహాయం చేసిన ఎల్.ఐ.సీ హెల్పింగ్ హ్యాండ్స్ కి పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *