దాణాకేసులో వెలువడ్డ తీర్పు

సంచలన దాణా కుంభకోణం కోసులో బీహార్ మాజీముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తెల్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటుగా మరో 17 మందని కోర్టు దోషులుగా నిర్థారించింది. జగన్నాథ్ మిశ్రాతో పాటుగా మరో ఏడుగురుకి కేసు నుండి విముక్తి కల్పించింది. జనవరి 3న వీరికి శిక్షలు ఖరారు అవుతాయి. రాంచీలోని ప్రత్యేక న్యాయస్థానం ఈ తీర్పును ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దాణా కుంభకోణం 1990-97 మధ్యన బీహార్ లో జరిగింది. ఆసమయంలో బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారు.